అబ్బో.. వైసీపీతో అంట‌కాగిన ల‌క్ష్మీషా ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్‌!

గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌తో పాటు చిన్న స్థాయి ఉద్యోగుల్లో కూడా టీడీపీ అనుబంధ మీడియా చీలిక తీసుకొచ్చింది. కొంద‌రు అధికారుల విష‌యంలో కూట‌మి స‌ర్కార్‌కు లేని ఇబ్బంది, బాధ…

గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌తో పాటు చిన్న స్థాయి ఉద్యోగుల్లో కూడా టీడీపీ అనుబంధ మీడియా చీలిక తీసుకొచ్చింది. కొంద‌రు అధికారుల విష‌యంలో కూట‌మి స‌ర్కార్‌కు లేని ఇబ్బంది, బాధ ఈ మీడియాకు వుందని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌తిదానికీ… వైసీపీతో అంట‌కాగిన ఫ‌లానా అధికారికి ఎలా పోస్టింగ్ ఇస్తారంటూ… టీడీపీ అనుబంధ మీడియా ప్ర‌శ్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో టీడీపీ అనుబంధ మీడియా మ‌న‌స్త‌త్వం ప్ర‌కారం వైసీపీ ప్ర‌భుత్వంతో అంట‌కాగిన ఐఏఎస్ అధికారిగా డాక్ట‌ర్ ల‌క్ష్మీషా గుర్తింపు పొందారు. అయిన‌ప్ప‌టికీ తాజాగా డాక్ట‌ర్ ల‌క్ష్మీషాను ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం విశేషం.

ఈ ఏడాది మొద‌ట్లో తిరుప‌తి క‌లెక్ట‌ర్‌గా నాటి ప్ర‌భుత్వం డాక్ట‌ర్ ల‌క్ష్మీషాను నియ‌మించింది. ఆ త‌ర్వాత టీటీడీ బోర్డు చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డిని క‌ల‌వ‌డాన్ని టీడీపీ అనుబంధ మీడియా తీవ్ర వివాదం చేసింది. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు రాజ‌గురువు ప‌త్రిక ల‌క్ష్మీషాకు వ్య‌తిరేకంగా భారీ క‌థ‌నాన్ని రాసింది. టీడీపీ అనుబంధ మీడియా క‌థ‌నాల్ని అడ్డంపెట్టుకుని కూట‌మి నాయ‌కులు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కార‌ణంతో ఈసీ కొంద‌రు ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అంశంపై కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది. మొత్తం ఆరుగురు ఐపీఎస్‌లు, ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ పి. జాషువా, అనంతపురం ఎస్పీ కేకే అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ కె. తిరుమలేశ్వర్పై బదిలీ వేటు వేసింది. అలాగే సీనియర్ ఐపీఎస్ అధికారి, గుంటూరు రేంజ్ ఐజీ జి. పాల్‌రాజును కూడా బదిలీ చేసింది. అలాగే కృష్ణా కలెక్టర్ పి. రాజబాబు, అనంతపురం కలెక్టర్ ఎం. గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీషాలపై వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా తిరుప‌తిలో భారీగా దొంగ ఓట్ల న‌మోదుపై ఫిర్యాదు చేసినా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీషా ప‌ట్టించుకోలేద‌ని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ల‌క్ష్మీషాపై ఆరోప‌ణ‌లు, కూట‌మి ఫిర్యాదును న‌మ్మిన ఈసీ వేటు వేయ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

నాడు వ‌ద్దే వ‌ద్ద‌న్న తిరుప‌తి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీషా, నేడు త‌న మామ పేరుతో ఉన్న జిల్లాకు క‌లెక్ట‌ర్‌గా సీఎం చంద్ర‌బాబు నియ‌మించ‌డం విశేషం. రాజ‌కీయం అంటే ఇదే మ‌రి. ఎందుక‌నో ల‌క్ష్మీషాను వైసీపీతో అంట‌కాగిన క‌లెక్ట‌ర్‌గా భావించి, ఎందుకు నియ‌మించార‌ని ప్ర‌శ్నిస్తూ ఎల్లో మీడియా క‌థ‌నాలు రాయ‌క‌పోవ‌డం కాసింత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

8 Replies to “అబ్బో.. వైసీపీతో అంట‌కాగిన ల‌క్ష్మీషా ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్‌!”

  1. What is the purpose of RUSHIKONDA Palace?. Why did Jagan Govt build it? Dear Great Andhra Writers, Could you please answer this? We support you and Jagan and give 175/175 in next 2029 elections. But Please answer to the the public.

    Expecting a valid reason.

  2. ఒరినీ తిక్క తగలెయ!

    ఈ లక్ష్మి షా గురించి రక్కయపొయినా తప్పె అంటవా? ఇదెమి తిక్క రా GA నీకు!

    నువ్వు కూడా లొండన్ మందులు వాడాలి రా అయ్యా!

Comments are closed.