లోకేష్ లైగర్ అంట.. తిట్టారా పొగిడారా?

లైగర్ మూవీ అంటే పూరీ జగన్నాథ్ గుర్తొస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో మరో వ్యక్తి ట్రెండ్ అవుతున్నారు. ఆయనే నారా లోకేష్. నారా లోకేష్ ని తెలుగుదేశం పార్టీ జనాలు ఇప్పుడు…

లైగర్ మూవీ అంటే పూరీ జగన్నాథ్ గుర్తొస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో మరో వ్యక్తి ట్రెండ్ అవుతున్నారు. ఆయనే నారా లోకేష్. నారా లోకేష్ ని తెలుగుదేశం పార్టీ జనాలు ఇప్పుడు కొత్తగా కీర్తిస్తున్నాడు. ఆయన్ను లైగర్ అంటున్నారు. కొత్తగా లైగర్ పేరుతో సినిమా వస్తోంది కాబట్టి ఆ పేరును లోకేష్ కు ఆపాదించేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఈ క్రమంలో తమ అభిమాన నాయకుడ్ని వారు తిడుతున్నారో, పొగుడుతున్నారో వారికే అర్థం కావడం లేదు.

లైగర్ అనేది క్రాస్ బ్రీడ్. అందుకే సినిమా టైటిల్ కూడా సాలా క్రాస్ బ్రీడ్ అని పెట్టుకున్నారు. సింహానికి, ఆడపులికి కలిగిన సంతానాన్ని లైగర్ అని పిలుస్తారు. మరి ఈ పేరుని లోకేష్ కి పెట్టుకుని ఆయన్ను పొడగటం నిజంగా పొగడ్తేనా లేక, అజ్ఞానంతో వేసిన నిందా..? ఇదే వారికి అర్థం కావడం లేదు. 

తమకు తామే తమ నాయకుడ్ని లైగర్ అని పిలుస్తుంటే.. వైసీపీ కార్యకర్తలు ఊరుకుంటారా..? సోషల్ మీడియాలో ఇరగదీస్తున్నారు. లోకేష్ ను సాలా క్రాస్ బ్రీడ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. లోకేష్ ను పొగడ్డం కోసం తెలుగు తమ్ముళ్లు ఒకటి అనుకుంటే, అది వేరే విధంగా టర్న్ అయింది.

పులులు, సింహాలు, లైగర్ లు..

బాలకృష్ణను ఎప్పుడూ సింహంతో పోలుస్తుంటాడు లోకేష్.. తాజాగా అయ్యన్నను పులితో పోల్చాడు. మరి లోకేష్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా తెలుగుతమ్ముళ్లు లైగర్ అనే పేరును తెరపైకి తెచ్చారు. కానీ అది ఇంత దారుణంగా రివర్స్ అవుతుందనుకోలేదు. 

పోనీ వైసీపీ నేతల కామెంట్లను కూడా లెక్కలోకి తీసుకుంటే.. నక్కలు, గుంట నక్కలు, ముసలి నక్కలు.. అన్నీ టీడీపీలోనే ఉంటే.. మరి ఆ పార్టీని జంతు ప్రదర్శనశాల అనుకోవాలా లేక, అమెజాన్ అడవి అనుకోవాలో వాళ్లే తేల్చుకోవాలి.

ఎక్కడ లేని క్రాస్ బ్రీడ్స్ అన్నీ తెలుగుదేశంలోనే ఉన్నాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను టీడీపీ నేతలు తమకు తామే రుజువు చేసుకుంటున్నారు. ఇలా లైగర్ పొగడ్తలతో అభాసుపాలవుతున్నారు.