'ఆ జగన్ గాడు మమ్మల్ని ఏం పీకాడు.. ఏం పీకుతాడు..' అంటూ ఇప్పటికి చాలా సార్లే ప్రశ్నించారు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్! సాధారంగా తెలుగు వాళ్లు పీకడం అనే మాటను బూతుగానే పరిగణిస్తారు. అయితే ఇలాంటి పదాన్ని పదే పదే వాడి వాడి దాన్నొక సాధారణ పదం అనే స్థాయికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు, లోకేష్ దే! ఎప్పుడు నలుగురు కార్యకర్తలు కనపడినా వీళ్ల గోల ఇలాగే సాగింది.
మరి ఇప్పుడేంటి.. కక్ష సాధింపు అంటూ ఏడుస్తున్నారు! వీరి బాగోతాలపై ఎలాంటి కేసులూ పెట్టకపోతే, ఏ విచారణలూ లేకపోతే ఏం పీకలేనట్టు! అదే విచారణలు వేసి, జైలుకు పంపిస్తే కక్ష సాధింపు! ఇంతేనా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కథ?
ఇక చంద్రబాబు అరెస్టుతో పీకితే ఉండే నొప్పి ఏమిటో లోకేష్ కు అర్థం అవుతూ ఉండవచ్చు! 70 యేళ్ల పై వయసులో చంద్రబాబుకు ఇలాంటి గతి పట్టింది. చంద్రబాబును నిన్న మొన్నటి వరకూ ఆరోగ్యవంతుడు అంటూ చాలా కలరింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన అనారోగ్యం, వయసు పరిస్థితులు అంటూ మాట్లాడుతున్నారు!
పుంగనూరుకు వెళ్లి తొడ కొట్టినప్పుడేమో చంద్రబాబు స్టామినా అంటూ రంకెలు వేశారు. నంద్యాల నుంచి విజయవాడ రోడ్డు ప్రయాణం అంటే.. ఆయన వయసును దృష్టిలో ఉంచుకోలేరా అంటారు! అది కూడా చంద్రబాబు మార్కు డ్రామానే అని సీఐడీ స్పష్టం చేస్తోంది.
నంద్యాల నుంచి విజయవాడకు తాము ముందే చాపర్ ను అరేంజ్ చేశామని అందులో ప్రయాణించవచ్చని సీఐడీ అధికారులు చెప్పారట! అయితే.. చంద్రబాబు రోడ్డు ప్రయాణం అన్నారట. తను విజయవాడ చేరేలోపు అల్లర్లతో రచ్చ లేపాలని ప్లానేశారో ఏమో! అలాగే రోడ్డు ప్రయాణం అంటూ సానుభూతి పొందే ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు.
ఇక కోర్టులో చంద్రబాబు తన కేసును తనే వాదించుకుంటా అన్నారట! మరి ఇలా వాదనాపటిమ గల చంద్రబాబు కోసం కోటిన్నర ఫీజు లూథ్రా ఎందుకు వచ్చినట్టు? అయితే కోర్టులో కూడా చంద్రబాబు తన ప్రసంగం చేశారని, కక్ష సాధింపు అంటూ మాట్లాడారని, దీంతో జడ్జి ఆ ప్రసంగాన్ని ఆపేశారని కూడా అక్కడ చూసిన వారు చెబుతున్నారు! మరి చంద్రబాబు వాదించుకుంటున్నారు అంటూ పచ్చమీడియా రంకెలు వేసింది. మరి అలా వాదించుకునే చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు పాలయ్యారనుకోవాలా!