పట్టుమని పది రోజులు కూడా ప్రజల్లో ఉండలేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే తనకు తానుగా ఏదైనా నిరూపించుకోవాలని జనాల స్పందన ఏలా ఉన్న ప్రజల్లో తిరుగుతున్న టీడీపీ యువకిశోరం నారా లోకేష్ బెటర్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎక్కడ మాట్లాడిన ఈ రోజు నుండి రాష్ట్రంలో రాజకీయ మార్పులు చూస్తారంటూ గొప్పలు చెప్పకునే పవన్ కళ్యాణ్ గత పది రోజులుగా పగలు అంత ఏసీ గదుల్లో మీటింగ్‌లు పెట్టి తీరా చీకటి పడగానే బస్సు యాత్ర చేసి రెండు రోజుల క్రితం యాత్రకు తాత్కలికంగా బ్రేక్ ఇచ్చి.. నిన్న హైదరాబాద్‌కు చేరుకున్నారు.
బస్సు యాత్రలో పవన్ కళ్యాణ్ మాటలు చేతలు చూసి ఆయన ఎన్నికల వరకు రాష్ట్రం వదిలి పోరని.. అందులోను సినిమా షూటింగ్‌లు కూడా ఆంధ్రలోనే చేయబోతున్నట్లు హడవుడి చేయడంతో అందరూ నిజం అనుకున్నారు. తీరా 10 రోజుల యాత్రలో కూడా మూడు రోజుల పాటు రెస్ట్ తీసుకున్న కూడా యాత్రకు బ్రేక్ ఇవ్వడం విశేషం. బస్సుపై పవన్ ఇప్పటి నుండి రాష్ట్రంలోనే ఉండి రాజకీయం చేస్తానంటూ ప్రకటించి తీరా రెండు వారాల పాటు కూడా ప్రజల్లో ఉండలేకపోవడంతో జనసైనికులు కూడా డీలపడ్డారు.
మరోవైపు నారా లోకేష్ దాదాపు 4నెలలు పైగా ప్రజల్లోనే ఉంటూ.. పాదయాత్ర చేస్తున్నారు. ఏ రోజు కూడా బయటికి అడుగుపెట్టని లోకేష్ కూడా తానేంటో నిరూపించుకోవడం కోసం ప్రయత్నిస్తుంటే.. చిన్నప్పటి నుండి కష్టాలు చూశా.. ఏ ఊరికి పోయిన ఇక్కడే పుట్టనంటూ చెప్పుకునే పవన్ మాత్రం 10 సంవత్సరాల్లో కనీసం పది రోజులు కూడా వరుసగా ప్రజల్లో ఉండలేకపోవడం విశేషం. బహుశా పవన్ ఇలాంటి రాజకీయాలు చేయడం వల్లే రెండు చోట్ల పోటీ చేసిన ఓడిపోయారంటూ సెటైర్లు వస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేస్తానంటూ ప్రగల్బాలు పలికిన ఆయన ఆ వైపుగా కార్యచరణ తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
కాగా ఒక వారం రోజుల పాటు హైదరాబాద్‌లో రెస్ట్ తీసుకొని వచ్చే వీకెంట్ నుండి పవన్ మరో దశ గోదావరి జిల్లాల్లోనే యాత్ర చేయబోతున్నట్లు జనసేన చెబుతోంది. పవన్ యాత్రను చూసిన జనాలు పవన్ కంటే లోకేష్ చాలా బెటర్ అనే అభిపాయ్రానికి వచ్చారు. ఎందుకంటే పవన్ మాటలు, చేతలకంటే లోకేష్ బాబు చాలా హుందగా నడుచుకుంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా పవన్ వల్ల ఒక వారం రోజుల పాటు మీడియాలో తనకు ప్రచారం రాకపోయిన.. పవన్ వల్ల ప్రజల్లో లోకేష్‌పైన మరింత మంచి అభిప్రాయం వచ్చిందని సంబర పడుతున్నారు టీడీపీ శ్రేణులు.