ఈ ఔదార్యం వైసీపీకి కూడా వర్తించాలి లోకేష్ గారూ!

ప్రభుత్వం వ్యవహరించే తీరును ప్రజలు చాలా నిశితంగా గమనిస్తూ ఉంటారు. తమను ఎవ్వరూ గమనించరనే భ్రమలో ప్రభుత్వం.. తమకు తోచినట్టల్లా చేసుకుపోతే.. పరాభవం తప్పదు. ముఖ్యనాయకుల పర్యటనల సందర్భాల్లో స్థానికంగా అరెస్టులు, గృహనిర్బంధాలు వంటి…

ప్రభుత్వం వ్యవహరించే తీరును ప్రజలు చాలా నిశితంగా గమనిస్తూ ఉంటారు. తమను ఎవ్వరూ గమనించరనే భ్రమలో ప్రభుత్వం.. తమకు తోచినట్టల్లా చేసుకుపోతే.. పరాభవం తప్పదు. ముఖ్యనాయకుల పర్యటనల సందర్భాల్లో స్థానికంగా అరెస్టులు, గృహనిర్బంధాలు వంటి అణచివేత చర్యలు జరుగుతూ ఉంటే వాటిని ప్రజలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. అలాంటి వాటి విషయంలో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొంత జాగ్రత్తపడుతున్నట్టు కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మడకశిర నియోజకవర్గంలో పర్యటించినప్పుడు.. అక్కడి సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సహజంగానే దీనిపట్ల ప్రజల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. నారాలోకేష్ వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టారు. సదరు సీపీఎం నాయకులకు సారీ చెప్పారు. మన్నించాలని అడిగారు. ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కులను కాపాడుతాం అని ట్వీట్ చేశారు.

లోకేష్ ఇలా తగ్గి మాట్లాడడాన్ని, మన్నింపు కోరడాన్ని ప్రశంసించి తీరాల్సిందే. అయితే ఈ వైఖరి సీపీఎం లాంటి నిరపాయకరమైన పార్టీల పట్ల మాత్రమే ఉంటుందా? లేదా, ప్రధానప్రతిపక్షం మీద కూడా ఉంటుందా? అనేది తెలియదు.

సీపీఎం వారి అరెస్టులకు ఆయన సారీ చెప్పారు బాగానే ఉంది. కానీ.. ప్రజలు ఎన్నుకున్న ఒక ఎంపీ తన సొంత నియోజకవర్గానికి పర్యటన ప్లాన్ చేసుకుంటే.. వెళ్లనివ్వకుండా గృహనిర్బంధం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి పుంగనూరుకు వెళ్లకుండా మొన్నటి అల్లర్లకంటెముందు మరోసారి తిరుపతి పోలీసులు నిర్బంధించిన వైనం గుర్తు చేసుకోండి. సీఎం పర్యటనల్లో వైసీపీ నాయకులు నిరసనలు ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేసినా వారిని అనుమతిస్తారా? అరెస్టు చేయకుండా ఉంటారా? అనేది కూడా ఇక్కడ కీలకం.

సీపీఎం, సీపీఐ రెండూ కూడా తమకు అప్రకటిత మిత్రపక్షాలు గనుక.. వారి పట్ల మాత్రం మెతక వైఖరి అవలంబిస్తూ అరెస్టు చేయవద్దని పోలీసులకు సూచిస్తూ.. వైసీపీ వారు ఏదైనా ఆందోళన చేసినప్పుడు మాత్రం.. కొరడా ఝుళిపించాల్సిందిగా ప్రభుత్వంలోని పెద్దలు రహస్య సంకేతాలు పంపితే గనుక.. ముందే చెప్పుకున్నట్లు, ప్రజలు అలాంటి ధోరణులను కూడా తప్పకుండా గమనిస్తారు.

7 Replies to “ఈ ఔదార్యం వైసీపీకి కూడా వర్తించాలి లోకేష్ గారూ!”

  1. అన్న ఇంట్లొ ఎలుకలు పట్టటానికి జనం సొమ్ము కొటి ముప్పై లక్షలు కర్చు చెసారు అంట! అసలు ఈ విషయమె రాయలెదు.

    .

    జరిగింది అన్న ఇంట్లొ కదా, ఎలా రాస్తాం అంటవా?

  2. లోకేష్ చెప్పింది అన్ని ప్రతిపక్షాలకి, ప్రజలకు వర్తిస్తాయి అని. ‘జగన్ ది పరదాల ప్రభుత్వం’ మాట ఏతేసింది ‘జిఏ’. నిద్ర కళ్ళతో చదివితే ఇలానే ఉంటుంది మరి. మరల జనాలు గమనిస్తున్నారు అని పదే పదే భేదిరింపులు ఒకటి. అస్సలాడు ‘జిఏ’ లాంటి ‘జగన్ భక్తి’ను, లెక్క చేస్తే కదా.

Comments are closed.