భార్యను కూడా బజారుకు లాగిన లోకేష్!

నారా లోకేష్ .. తన అజ్ఞానాన్ని కొన్ని వందల వేల సందర్భాల్లో బయటపెట్టుకుంటూ ఉంటాడు. తన అజ్ఞాన ప్రదర్శన ద్వారా.. అసలు రాజకీయాలకు తాను ఏ రకంగా పనికిరాని వ్యక్తినో ఆయన పదేపదే నిరూపించుకుంటూ…

నారా లోకేష్ .. తన అజ్ఞానాన్ని కొన్ని వందల వేల సందర్భాల్లో బయటపెట్టుకుంటూ ఉంటాడు. తన అజ్ఞాన ప్రదర్శన ద్వారా.. అసలు రాజకీయాలకు తాను ఏ రకంగా పనికిరాని వ్యక్తినో ఆయన పదేపదే నిరూపించుకుంటూ ఉంటారు.

దొడ్డిదారిలో తనను మంత్రిని చేసిన తండ్రి నారా చంద్రబాబునాయుడు.. తనను ముఖ్యమంత్రిని కూడా చేసేయాలని తపన పడడం రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో.. స్వయంగా నారా లోకేష్ వ్యవహార సరళిలోనే మనకు అతి తరచుగా ఆయన అజ్ఞాన ప్రదర్శన ద్వారా అర్థం అవుతుంటుంది.

తాజాగా గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలోకి తన భార్య ను కూడా లాగి.. నారా లోకేష్ ప్రదర్శించిన చవకబారు కామెడీ, ఆయన అజ్ఞానాన్ని బుద్ధిలేని తనాన్ని చాటిచెబుతోంది.

‘‘బ్రహ్మణి అడిగింది.. ఏంటా వీడియో అని.. వద్దులేమ్మా నీకీ గోల అన్నా..’’ అంటూ ఒక వెకిలినవ్వుతో నారా లోకేష్ పార్టీ కార్యకర్తల సమావేశంలో అన్నమాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

గోరంట్ల మాధవ్ వీడియో ఏమిటనేది ఇవాళ తెలుగునాట వార్తలు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ తెలుసు. అందరూ ఆ వీడియో చూసి ఉండకపోవచ్చు. కానీ బట్టల్లేకుండా ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్న దృశ్యం అది అనే సంగతి అందరికీ తెలిసిందే. అసహ్యించుకునే వారు అంతవరకు ఆగిపోతారు. తన భార్య బ్రహ్మణి దాని గురించి ప్రత్యేక ఆసక్తి చూపించినట్టుగా.. నారా లోకేష్ నలుగురిలో చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆయనకసలు బుద్ధి ఉందా? ఉంటే, పనిచేస్తోందా? దాని పర్యవసానం ఏం ఉంటుందనే కనీస జ్ఞానం లోకేష్ కు ఉందా? 

అసలు లోకేష్ చెప్పిన మాటల అర్థం ఏమిటి? ‘‘బ్రహ్మణి, మాధవ్ వీడియో గురించి లోకేష్ ను వాకబు చేసింది’’ అని. ఇలాంటి అర్థమొచ్చేలా మాట్లాడడం వల్ల తన భార్య బ్రహ్మణి విపరీతంగా ట్రోల్స్ కు గురవతుందనే స్పృహ ఈ మహానాయకుడు లోకేష్ కు లేదా? లేకపోతే, తను ఎటూ ట్రోల్ అవుతూ ఉంటాడు గనుక.. తన భార్య మాత్రం ఎందుకు ప్రశాంతంగా ఉండాలని పగబట్టాడా? 

తమ ఇంటి ఆడవాళ్లను బజార్లోకీ లాగేదీ వాళ్లే. మా ఆడవాళ్లను అల్లరిచేస్తున్నారని ఏడ్చేదీ వాళ్లే.. అన్నట్టుగా ఉంది లోకేష్ వ్యవహారం. 

అది ఫేక్ అని ధ్రువీకరణ అయ్యేవరకు, గోరంట్ల మాధవ్ చేసినది నీచమైన పనే! అయితే దాని గురించి విమర్శించే సమయంలో విపక్షనేతలు (వాళ్లు అసలు నాయకులు అనే పదానికి తగినవాళ్లు అయితే) వ్యవహరించాల్సిన తీరు ఏమిటి? అది చాలా సీరియస్ సంగతి! సీరియస్ గానే విమర్శలు చేయడానికి పూనుకోవాలి.

లోకేష్ చాలా చీప్ గా, నేలబారు మనిషిలాగా.. వెకిలి నవ్వులతో దాని గురించి మాట్లాడుతూ.. ‘‘నీకు రాలేదా.. నా ఫోనుకు వందమంది పంపించారు.. వెయ్యి మంది పంపించారు.. వాటిని డిలిట్ చేసుకోవడమే సరిపోయింది..’’ అంటూ వెకిలి నవ్వులతో చెప్పడం చాలా అసహ్యంగా అనిపిస్తుంది.

ఈ వ్యవహారాన్ని  సీరియస్ గా డీల్ చేయలేని ప్రతిపక్ష నాయకులు ఉండడం సిగ్గు చేటు. వెకిలిగా తీసుకుంటున్నారంటేనే.. వారికి దీనిని రాజకీయ లబ్ధికి తప్ప మరోలా వాడుకునే ఉద్దేశమూ లేదన్నది స్పష్టం. 

ఇలాంటి మహా అజ్ఞాన ప్రదర్శన జరిగినప్పుడెల్లా.. తాను ప్రజల మనిషిని అని చెప్పుకోడానికి అవసరమైన కనీస స్థాయి హుందాతనం కూడా లేని వెకిలి లోకేష్ కంటె.. ఆయన తండ్రి చంద్రబాబు చాలా బెటర్ అనిపిస్తుంది.