యంగ్ హీరోకి త్వరలో పెళ్లి

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లు చాలా మంది వున్నారు. వీళ్లలో ముఫైలు దాటిన వారు నలభై లకు దగ్గరైన వారు, నలభైలు దాటేస్తున్నవారు కూడా వున్నారు.  Advertisement కెరీర్ మీదే కీలక దృష్టి…

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లు చాలా మంది వున్నారు. వీళ్లలో ముఫైలు దాటిన వారు నలభై లకు దగ్గరైన వారు, నలభైలు దాటేస్తున్నవారు కూడా వున్నారు. 

కెరీర్ మీదే కీలక దృష్టి పెట్టడం, పెళ్లి వైపు దృష్టి సారించకపోవడం వల్ల ఇంటి వారు కాకుండా వుండిపోతున్నారు. ఒక్కో ఏడాది ఒక్కొక్కళ్లు మెల్లగా బ్రహ్మచారి జీవితానికి స్వస్తి చెప్పి, పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.

రాబోయే రెండు..మూడు నెలల్లో ఓ హీరో కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ యంగ్ హీరో కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నే. ఇప్పటి వరకు ఇతగాడి పెళ్లి వార్త ఒకటి రెండు సార్లు వార్తల్లోనే వుంటూ వచ్చింది. కానీ ఈసారి పక్కాగా ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది. తను మనసారా ప్రేమించిన అమ్మాయి మెడలోనే తాళి కట్టబోతున్నాడని బోగట్టా.

పెళ్లి డెస్టినేషన్ మేరేజ్ కాదు. పెళ్లి కుమార్తె ఇంట్లోనే జరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు నాలుగు సినిమాలు వున్నాయి. ప్రస్తుతానికి ఇంతే వివరాలు.