అన్నదాత గుండెల్లో నుంచి ఎగరనున్న విమానం

ఎక్కడ భూ సేకరణ జరపాలన్నా భూములు వేలాదిగా అవసరం అవుతాయి. పచ్చని పొలాలలోని భూములనే ఫణంగా పెట్టాల్సి వస్తుంది. అభివృద్ధి మాటున ఉన్న ఉపాధి పోతుందన్నది రైతుల ఆక్రోశంగా ఉంది. ఒక అభివృద్ధి ప్రాజెక్ట్…

ఎక్కడ భూ సేకరణ జరపాలన్నా భూములు వేలాదిగా అవసరం అవుతాయి. పచ్చని పొలాలలోని భూములనే ఫణంగా పెట్టాల్సి వస్తుంది. అభివృద్ధి మాటున ఉన్న ఉపాధి పోతుందన్నది రైతుల ఆక్రోశంగా ఉంది. ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ పట్టాలెక్కితే గట్టిగా పది వేల మందికి ఉపాధి దక్కుతుందో లేదో తెలియదు. కానీ, అంతకు పదింతల మంది భూములు కోల్పోవడం వల్ల పూర్తిగా ఉపాధిని పోగొట్టుకున్నారని అంటున్నారు.

శ్రీకాకుళంలోని పలాసలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఎయిర్‌పోర్టు కోసం భూములను సేకరించాలనుకుంటున్నది పచ్చని పొలాల నుంచే అని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజల జీవనాధారం అయిన ఉద్దానం జీడి తోటల మధ్య నుంచి ఎయిర్‌పోర్టు నిర్మాణం చేయాలన్న నిర్ణయాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఆలోచనల్ని విరమించుకోవాలని కోరుతున్నారు.

మొత్తం 20 గ్రామాల పరిధిలో గ్రీన్ ఫీల్డ్ కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణం వల్ల రైతులకే చేటు వస్తుందని ప్రజా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. రైతులకు ఉపాధి పూర్తిగా పోతుందని, అందువల్ల పంట భూముల్లో తోటలతో ఆదాయం వచ్చే ప్రాంతాల్లో భూసేకరణను నిలిపివేయాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు అవుతోంది. అంత పెద్ద ఎయిర్‌పోర్టు ఉండగా మళ్లీ శ్రీకాకుళానికి వేరేగా ఎందుకు అన్న ప్రశ్నను ప్రజా సంఘాలు ముందుకు తెస్తున్నాయి. ఉన్న ఉపాధిని, భూమిని రైతులు కోల్పోయే విధంగా వ్యవహరించవద్దని సూచిస్తున్నాయి. కానీ, ప్రభుత్వం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై పట్టుదలగా ఉంది. దాంతో భూసేకరణ తప్పదని అంటున్నారు.

18 Replies to “అన్నదాత గుండెల్లో నుంచి ఎగరనున్న విమానం”

  1. They are against atomic energy plant, they’re against airport. The people from their place go as watchman to apartments in big cities. They want their place to be developed. Yet they protest against everything.

  2. ఎవ్వరు చేసినా భూ సేకరణ జరుగుతుంది ఒక్క జగన్ మోహన్ రెడ్డి తప్ప. మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారని తెలిసి ఒక్క ప్రాజెక్ట్ కూడా చెయ్యలేదు.

    1. You are right brother. Yoosless fellows are obstructing development in Palasa area. To be developed we need airport in every district. Kootami should ignore all these jokers and just focus on development.

  3. జగన్ మాత్రం భూసెకర లెకుండా ఆకాశం కడతాడా? ఎవరినా భూమి సెకరించాల్సిందె!

  4. జర్నలిస్ట్ విజయ్ బాబు పై ఏపీ హైకోర్టు సీరియస్ .. జరిమానా

    .

    సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తున్నవారిపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ శ్రేణులతో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు పోస్టులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకోకుండా తాము ఆదేశించలేమని హైకోర్టు పలువురు పిటిషనర్లకు సూచించింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే కేసులు పెడుతున్నారంటూ విజయ్‌బాబు కోర్టుకు ఆశ్రయించడంతో.. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

    .

    ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉద్దేశాలను విస్మరించారని పిటిషనర్‌ను న్యాయస్థానం హెచ్చరించింది. కిరాయి మూకలుగా పనిచేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగపరుస్తున్నవారిపై చర్యలు తీసుకోవల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.

  5. వైజాగ్ లో ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ ఉంది, కొత్తగా ఇంకోటి వస్తోంది. మళ్ళీ శ్రీకాకుళం లో ఎందుకు?

  6. Development avutunte addu padutunna Y(P gallani tannali. We want development. Do not stop these development activities please. No one wants those jaffa welfare schemes again.

  7. ఇలా ప్రైవేట్ వ్యక్తుల/రైతుల నుంచి తీసుకుని కట్టే ప్రాజెక్ట్స్ నుంచి వచ్చే ప్రాఫిట్ లో ఒక 5% ఆర్ 10% ఒక ట్రస్ట్ కి ఇచ్చి, ఆ రైతులని ఆ ట్రస్ట్ కి భాగస్వాములని చెయ్యాలి.…

    .

    మన మహా మేత VANPIC కి లక్ష ఎకరాలు ఇచ్చినట్టు కాకుండా..

  8. ఇలా ప్రైవేట్ వ్యక్తుల/రైతుల నుంచి తీసుకుని కట్టే ప్రాజెక్ట్స్ నుంచి వచ్చే ప్రాఫిట్ లో ఒక 5% ఆర్ 10% ఒక ట్రస్ట్ కి ఇచ్చి, ఆ రైతులని ఆ ట్రస్ట్ కి భాగస్వాములని చెయ్యాలి.…

    .

    మన-మహా-మేత-VANPIC-కి-లక్ష-ఎకరాలు-ఇచ్చినట్టు -కాకుండా..

  9. ఏక కాలంలో ఆరు పంటలు పండే కృష్ణా డెల్టా లోని అమరావతి పొలాలకే దిక్కు లేదు….

Comments are closed.