నయనతార ‘కర్మ’ సిద్ధాంతం

నయనతార ఇప్పుడు ఏం మాట్లాడినా, ఏ పోస్టు పెట్టినా దాన్ని ధనుష్ తో ముడిపెట్టి చూడడం కామన్ అయిపోయింది. తాజాగా ఆమె పెట్టిన ఓ కొటేషన్ ను కూడా జనం ఇలానే చూస్తున్నారు. కర్మ…

నయనతార ఇప్పుడు ఏం మాట్లాడినా, ఏ పోస్టు పెట్టినా దాన్ని ధనుష్ తో ముడిపెట్టి చూడడం కామన్ అయిపోయింది. తాజాగా ఆమె పెట్టిన ఓ కొటేషన్ ను కూడా జనం ఇలానే చూస్తున్నారు. కర్మ సిద్ధాంతానికి సంబంధించిన కొటేషన్ అది.

“కర్మ ఏం చెబుతోందంటే.. అబద్ధాలతో ఒకరి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే, దాన్ని లోన్ అనుకోండి. ఎందుకంటే, అది వడ్డీతో సహా తిరిగి మీకు వచ్చేస్తుంది.” అంటూ ఓ కొటేషన్ రాసుకొచ్చింది నయనతార.

ధనుష్ ను ఉద్దేశించి నయనతార ఆ కొటేషన్ పెట్టి ఉంటుందంటున్నారు చాలామంది. ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య లీగల్ యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే.

తన అనుమతి లేకుండా నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రయిలర్ లో ‘నేనూ రౌడీనే’ సినిమాకు సంబంధించిన మేకింగ్ విజువల్స్ వాడారంటూ నయనతారకు నోటీసులు పంపించాడు ధనుష్. 3 సెకెన్ల క్లిప్ ను అనధికారికంగా వాడినందుకు 10 కోట్లు చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు.

నయనతార నుంచి తగు సమాధానం రాకపోవడంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్, నెట్ ఫ్లిక్స్ కంటెంట్ వ్యవహారాలు చూసుకునే భారతీయ కంపెనీ లాస్ గాటోస్ ప్రొడక్షన్ సర్వీసెస్ ఇండియాపై కేసు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ వేసుకున్నాడు.

ధనుష్ తరఫు లాయర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. పేటెంట్ రైట్స్ క్లాజ్-12 ప్రకారం.. వీళ్లపై దావా వేయడానికి ధనుష్ కు అనుమతినిచ్చింది. ఇది జరిగిన కొన్ని గంటలకే నయనతార కర్మ కొటేషన్ పెట్టింది.

7 Replies to “నయనతార ‘కర్మ’ సిద్ధాంతం”

  1. కోర్టు లో వాదించడానికి ఏమీ లేదనుకుంటా ఇలా బైట క్వోటేషన్స్ పెడుతోంది.

  2. ధనుష్ పిటిషన్ ని కొట్టివేస్తే నయనతార కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది, కానీ అనుమతించినట్టు ఆర్టికల్ లో రాశారు

    నెటిజెన్లకు దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదా?

Comments are closed.