ఫినిషింగ్ టచ్ ఉందా పుష్పా..?

ఇప్పుడు కాదు, మూడేళ్లుగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. ఎట్టకేలకు ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలకు సిద్ధమౌతోంది పుష్ప-2. మరి 2024కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే సినిమా ఇదేనా? డిసెంబర్ లో వస్తున్న మిగతా…

ఇప్పుడు కాదు, మూడేళ్లుగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. ఎట్టకేలకు ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలకు సిద్ధమౌతోంది పుష్ప-2. మరి 2024కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే సినిమా ఇదేనా? డిసెంబర్ లో వస్తున్న మిగతా సినిమాల సంగతేంటి?

పుష్ప-2తోనే డిసెంబర్ బాక్సాఫీస్ సాలిడ్ గా ఓపెన్ అవ్వబోతోంది. దీని కోసం ఒక వారం ముందే (నవంబర్ చివరి వారం) బాక్సాఫీస్ ను డ్రై గా పెట్టారు. రిలీజ్ తర్వాత వారం (డిసెంబర్ 13) కూడా ఇతర సినిమాలేవీ రాకుండా డ్రై పెట్టారు. ఇంకా చెప్పాలంటే.. 5వ తేదీ నుంచి 20 వరకు పుష్ప-2 తప్ప మరో సినిమా లేదు.

ఇలా పుష్ప-2 కోసం గ్రౌండ్ ను సిద్ధం చేశారు మేకర్స్. అగ్రిమెంట్లు కూడా పూర్తిచేశారు. ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్ లో పుష్ప-2 సినిమా 6 భాషల్లో రిలీజ్ అవుతోంది. 20వ తేదీ నుంచి మరికొన్ని సినిమాలొస్తున్నాయి.

ముందుగా అల్లరినరేష్ నటించిన బచ్చల మల్లి గురించి చెప్పుకోవాలి. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో ఈ సినిమా సరైన అంచనాల్ని సెట్ చేసింది. రిలీజ్ టైమ్ కు మరో కట్ ఏదైనా వస్తే, అంచనాలు పెరగడం ఖాయం.

అదే రోజున ‘సారంగపాణి జాతకం’ వస్తోంది. సునిశిత హాస్యం పండించగలడనే పేరున్న ఇంద్రగంటి, ప్రియదర్శి హీరోగా ఈ సినిమా తీశాడు. వీటితో పాటు విడుదల-2, యూఐ అనే 2 డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి ఎలాంటి సందడి చేయడం లేదు.

డిసెంబర్ నెలలో ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న మరో సినిమా రాబిన్ హుడ్. నితిన్-శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకుడు. రీసెంట్ గా వచ్చిన టీజర్ కు పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా, సినిమాలో చాలా దాచామంటున్నాడు డైరక్టరు. ఈ సినిమాతో పాటు వెన్నెల కిషోర్ హీరోగా ‘శ్రీకాకుళం షెర్లూక్ హోమ్స్’ అనే సినిమా కూడా వస్తోంది.

ఇలా డిసెంబర్ లో పుష్ప-2తో పాటు నితిన్, ప్రియదర్శి, అల్లరి నరేష్, వెన్నెల కిషోర్ సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటిలో పుష్ప-2 టాక్ తో సంబంధం లేకుండా కచ్చితంగా కలెక్షన్లు కుమ్మేస్తుంది. అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో పాటు పైన చెప్పుకున్న మూవీస్ లో ఏ మూవీ క్లిక్ అవుతుందో చూడాలి.

5 Replies to “ఫినిషింగ్ టచ్ ఉందా పుష్పా..?”

Comments are closed.