అసలు మీకు ఏం తెలుసు పవన్ గారూ?

ప్రజల అవసరాలు గుర్తించకుండా పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానిదా? ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం చేస్తున్న ప్రజలదా?

కాకినాడలో రేషన్ బియ్యం మాఫియా అంటూ ఈ రోజు నానా హడావుడి చేసారు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తాను డిప్యూటీ సీఎం అయ్యి వుండి కూడా తాను వస్తే ఎస్పీ సెలవులో వెళ్తున్నారని కామెంట్ చేసారు. మరి ఇప్పుడు చర్య ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వంలోనే ఉన్నారు కానీ ప్రతిపక్షంలో లేరు కదా పవన్? లోకల్ ఎమ్మెల్యే కొండబాబును మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంతకీ అసలు రేషన్ బియ్యం, దాని మూలాలు ఏమైనా పవన్ కళ్యాణ్‌కు తెలుసా?

కాస్త వివరంగా మాట్లాడుకుందాం.

కిలో బియ్యం నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయలకు అమ్ముతుంటే, జస్ట్ కిలో రూపాయికి ఇస్తోంది ప్రభుత్వం. అయినా కూడా పల్లెటూర్లలో ఈ బియ్యం తినేవారు కనీసం పది శాతం మంది కూడా ఉండరు అని పవన్ కళ్యాణ్‌కు తెలుసా?

ఎందుకు తినరు అంటే పల్లెటూరిలో దాదాపు యాభై శాతం కుటుంబాలకు చిన్నదో, పెద్దదో ఓ పొలం ఉంటుంది. కొన్ని సెంట్లైనా, కేవలం తిండి గింజల కోసం పండించుకుంటారు. వాటినే తింటారు. ఈ కోటా బియ్యాన్ని తినరు గాక తినరు.

మిగిలిన యాభై శాతం కుటుంబాల్లో కొందరు ఏడాదికి ఒకసారి కొద్దిగా ధాన్యం కొనుక్కుని నిల్వ వేసుకుంటారు. వారికీ ఈ బియ్యం అక్కరలేదు.

ఓ పది నుంచి ఇరవై శాతం మంది మాత్రమే కోటా బియ్యం వండుకుని తింటారు. ఇది పచ్చి వాస్తవం. కావాలంటే విచారణ చేసుకోవచ్చు.

ప్రతి పల్లెటూరిలో కోటా బియ్యం అందించిన తర్వాత ఏం జరుగుతుంది?

ఎవరో ఒక వ్యాపారి రెగ్యులర్‌గా గోనె సంచులు మోపెడ్ మీద పట్టుకుని ఇంటింటికి వచ్చి, రేషన్ బియ్యం తీసుకుని, కిలోకి పదహారు రూపాయల వంతున ఇస్తాడు. అలా ఒకటి రెండు ఊళ్ల నుంచి సేకరించిన బియ్యం అన్నీ కొన్ని బస్తాలు అతగాడి దగ్గర పేరుకుంటాయి.

మండలం మొత్తానికి ఓ బయ్యర్ ఉంటాడు. అతగాడి దగ్గరకు ఈ బస్తాలు చేరతాయి.ఈ బియ్యం అన్నీ కిలో 17 నుంచి 18 రూపాయల వంతున. అతగాడి నుంచి లోకల్ మిల్లర్ కు చేరతాయి. అక్కడి నుంచి కాకినాడ చుట్టుపక్కల పెద్ద మిల్లలకు చేరతాయి. అక్కడ వీటిని మరోసారి మిల్లింగ్ చేస్తారు. దాంతో దుడ్డుబియ్యం కాస్తా సన్న బియ్యంగా మారతాయి. కొత్త ప్యాకింగ్ తో ముచ్చటగా మారతాయి. ఎగుమతికి రెడీ అవుతాయి.

ఇప్పుడు చెప్పండి ఉపముఖ్యమంత్రి గారూ, తప్పు ఎవరిది?

ప్రజల అవసరాలు గుర్తించకుండా పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానిదా?

ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం చేస్తున్న ప్రజలదా?

ఈ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డులు రద్దు చేస్తే, మరో పార్టీ గోలపెడుతుంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి కార్డులు తగ్గిస్తే, ఈ పార్టీ గోల చేస్తుంది. ఈ రాజకీయ ఆట ఎప్పటికైనా ఆగుతుందా? ఆగమన్నా ఆగదు.

ముందుగా చేయాల్సింది.. ఎవరు రేషన్ బియ్యం తింటారు? ఎవరు తినరు? అన్నది క్లారిటీగా లెక్క తేల్చాలి.

బియ్యం తిననివారు పక్కా చెప్పితే, వారికి బదులుగా కందిపప్పు లేదా వంట నూనె వంటి ప్రత్యామ్నాయాలు అందించాలి.

ప్రభుత్వం బియ్యం భారీగా సేకరించే పని, రవాణా, స్టోరేజీ విధానాలు తగ్గుతాయి.

అదే సమయంలో మిల్లుల తనిఖీకి పకడ్బందీ విధానం అమలు చేయాలి. ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించాలి. ఇవన్నీ చేయకుండా కేవలం పోర్టుల దగ్గర హడావుడి చేస్తే ఉపయోగం ఏమిటి? కేవలం రాజకీయాల కోసం చేసినట్లు వుంటుంది తప్ప మరేమీ కాదు.

మిల్లర్ల సంఘాలు, వాటి ప్రభావం, సిఫార్సులు, ఇంకా ఇంకా అవి వాడే అనేక పద్దతులు ఇలా వున్నంత కాలం ఇవేమీ ఆగవు. ఒక రోజు హడావుడి తప్ప.

92 Replies to “అసలు మీకు ఏం తెలుసు పవన్ గారూ?”

  1. ప్రతి పక్షం లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తారు, ఇప్పుడు వీళ్లదే అధికారం, ఇప్పుడు కూడా పాత ప్రభుత్వం లో వ్యవస్థలు పాడుచేశారు, మాఫియా అంటూ తప్పించుకుంటున్నారు. ఇంకెందుకు మీరు?

    1. Rey చర్యలు మొదలవుతాయి పట్టుకున్నాడు గా తనే స్వయంగా. . మన అన్న బగ్గితాలు అన్ని ఒక్కోటి బయటకు తీస్తాం

  2. పోర్ట్ అరబిందో కంట్రోల్ లో పెట్టుకుని రైస్ స్మగ్లింగ్ చెయ్యటం కరెక్టే అంటావు అయితే..

  3. మీకీ ఇవన్నీ తెలిసినపుడు అన్నియ కి చెప్పి అప్పుడే సరిచేయచ్చు కదా

  4. ఇవన్నీ అందరికీ తెలుసు GA గారూ… అసలు ఈ బియ్యం ఎవరూ తినరు అని తెలిసి కూడా పంపిణీ చేసే ప్రభుత్వాలదే తప్పు. ఓటు రాజకీయాలు … మీరైనా… వారైనా

  5. Mari 10% maatrame ration biyyam tine laga ayithe annayya antha karchu petti vans enduku konnadu malli driver salary oka karchu appudu cheppalede ee suddulu ani netizens asking

  6. Port ఎవరిది GA…. ఎవరి దగ్గర నుంచి బలవంతంగా ,బెదిరించి లాక్కున్నారు…. ఏంతకు లాక్కున్నారు….ఈ బియ్యం మాఫియా వెనుక ఉన్నది ఎవరు….అసలు PORT లను అడ్డం పెట్టుకొని ఇంకెన్ని దారుణాలు చేశారు ,చేస్తున్నారు….వీటి గురించి చెప్పు GA…

  7. అబ్బా ఏమి సెప్తిరి, ఏమి సెప్తిరి? కవర్ డ్రైవ్ లో గుండప్ప విశ్వనాధ్, జావేద్ మియాందాద్ ని మించి పోయావ్ కదా?

    అసలు రేషన్ షాప్ వాడే బియ్యం వద్దు అంటే, దానికి కిలో కి 15 రూపాయలు లెక్క గట్టి బియ్యాన్ని తన దగ్గరే ఉంచుకుంటాడు. అవే బస్తాలు నల్ల బజార్ కు తరలి పోతాయి. ఇంకా ద్వారంపూడి మాఫియా చేసేది రైస్ మిల్స్ నుండి PDS బియ్యం డైరెక్ట్ గ కాకినాడ పోర్ట్ కు గ్రీన్ ఛానల్ ద్వారా తరలిస్తారు . అక్కడ నుండి ఆఫ్రికా దేశాలకు స్మగుల్ అవుతాయి. ద్వారంపూడి అధికారం లో లేకపోయినా అతను చూపిన మార్గం లో లంచగొండి అధికారులు కాసులకు కక్కుర్తి పడి చేస్తే, ఈ రోజు యాంకరేజ్ లో ఒక షిప్ పట్టుబడింది. పవన్ స్వయంగా వెళ్లి చూడడం ద్వారా, ఈ మాఫియా కి తాము వ్యతిరేకం అని అధికారులకు స్పష్టమైన సందేశం ఇచ్చినట్టు అయ్యింది. ఈ వ్యయవహారం లో విచారణ అనంతరం ఉద్యోగాలు ఊడతాయి, నీ కాకమ్మ కబుర్లు ఆపితే బెటర్.

    1. అదీ నెక్స్ట్ పాతిక సంవత్సరాలకి, అంటే ఈడికో మనవడు పుట్టి, అతనికి రాజారెడ్డో, రాజశేఖర్రెడ్డో

      అని పేరు పెట్టి,అతను ఇంకో నాయకుడు అయ్యే వరకు..

  8. చట్ట వ్యతిరేకంగా వ్యాపారం ఎవరు చేసిన తప్పే.

    అది ప్రజలు అయిన, ప్రజా ప్రతినిధులైనా, లేక స్మగ్లర్లు అయిన.

    రాష్ట్ర సంపద రాష్ట్రానికే చెందాలి కానీ ఒక స్మగ్లర్ జేబులోకి కాదు.

  9. వైజాగ్ స్టీల్ ప్లాంటుకు కావలసిన ముడి ఇనుమును ఎంతో దూరంలో ఉన్న రూర్కెలా, ధన్ బాద్ మైన్స్ నుండి కొనుక్కుంటున్నారు.

    కానీ మన రాష్ట్రంలోనే ఉన్న అనంతపురంలో ఉన్న మైన్స్ నుండి ఇనుప ఖనిజాన్ని ఆ గాలి గాడు, వాడి సీక్రెట్ పార్టనర్ తవ్వేసిన చైనాకు స్మగ్లింగ్ చేసి ప్యాలెస్లు కడుతున్నారు.

    ఇది స్మగ్లింగ్ కాదా??

    1. ఆ గాలి గాడి సీక్రెట్ పార్టనర్ ఎవడో వైసీపీ పార్టీ వారికి, వారి అభిమానులకు తెలుసు. కానీ చెప్పారు

  10. PK..ఒక..అసమర్ధుడు, ఎందుకంటే..లోకేష్..వీళ్ళ..అమ్మను..తిట్టాడు..అన్నాడు, యెల్లో..మీడియా..పరిటాల..గుండు..కొట్టిచ్చాడు..అని..ప్రచారము ..చేసాడు ..అన్నాడు.వీళ్ళ..అన్నను..యెల్లో..మీడియా..జీరోను..చేసింది, BK..వీళ్ళను..అలగా..జనము..అన్నాడు. అయినా..అమ్ముడు..పోయి..టీడీపీ..కి..వంత..పడుతున్నాడు. ఈయన..గురించి..ఆర్టికల్..దండగ. ఇంకొక..కొన్ని..నెలలు..పోతే..ఈయన..చేసే..అతికి..యెల్లో..మీడియానే..పరువు..తీస్తుంది, కొంచెము..ఆగితే..చాలు.

  11. GA గారు, క్రితం పవన్ గారు పూనుకోబట్టే ఈ సోషల్ మీడియా లో విచ్చలవిడితనం మీద ఉక్కు పాదం మోపారు, ఇప్పుడు వ్యవస్థ లో అవినీతికి కురుకుపోయిన్న అధికారులు వారిని ఆడించే “కింగ్ పిన్ ” లకు అందరికీ ఉంటుంది తొందర పడొద్దు, మీ చెడు రాతలకు ఫేక్ ప్రొఫైల్ పెట్టుకున్న వాళ్ళు లైక్స్ కొడతారేమో కానీ సామాన్యులు ఎవరు హర్షించరు

    1. ఉక్కు..పాదము..లేదు..తొక్క..పాదము..లేదు, BK..చెప్పినట్టు..అలగా..జనము..అందరిని..తప్పుడు..పోస్ట్ లతో..పచ్చి..బూతులతో..వేధిస్తున్న..జన..సైకోలు, సైకోలకు..లీడర్..అయినా..తనను.., రెడ్..బుక్..వెంగళప్పను..అరెస్ట్..చేయించుకోవాలి

      1. ఈ సంస్కృతి కి ఆజ్యులు పూజ్యులు ఎవరో అందరికీ తెలుసు సార్, ఈ విశృంఖలత్వానికి ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు కట్టడి చేయాలి ఇప్పుడే కదా మొదలైంది వస్తుంది లెండి దారి లోకి, భాష పదజాలం లో స్వీయ నియంత్రణ తప్పనిసరి

  12. పులివెందులలో వైసీపీ నేతల ఆధీనంలోని కార్లను విడిపించిన తెలంగాణ పోలీసులు! – దీనిమీద కూడా తిమ్మిని బమ్మిని చేసి ఏదోటి రాయి ఎంకటి నమ్మటానికి మన గొర్రె బిడ్డలు రెడీ..

  13. కాకినాడ ఎంపీ, పౌరసరఫరాల శాఖ మంత్రి, పౌరసరఫరాల కమీషన్ చైర్మన్, కేకేడీ పట్టణాభివృద్ధి చైర్మన్,వీళ్లంతా యే పార్టీ నో చెప్పండి పావలా గారు? కెమెరా ముందు వీరవిహారం చేయడం బావుంది.

    బియ్యం మాఫీయా అని ఒకవైపు చెప్తూ ఆ చైర్మన్ నీ yc పి నుండి JSP కి తీసుకుంది ఎవరూ?

  14. ఏ పార్టీ అధికారం లో వున్నా కొంతమంది అధికారులు విచ్చలవిడి గ అవినీతి చేసి అడ్డగోలుగా ఆస్తులు కూడపెట్టుకొన్నారు వాళ్ళు ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో పెట్టి జలగల్లాగా ప్రజల రక్తమాంసాలు ను పీల్చి పిప్పిచేసేరు వీళ్ళను తెలంగాణాలో కెసిఆర్ నయీమ్ ను చేసి ఆస్తులు లాక్కున్నట్టు చెయ్యాలి అప్పుడు అవినీతి చెయ్యాలన్న భయపడతారు వాళ్ళ అక్రమాస్తులను నిక్కచ్చి గ వసూలు చేయాలి టోల్ టాక్స్ వంటివి ఈ అక్రమాస్తులను వసూలు చేస్తే అవసరం ఉండదు ప్రజలు కూడా కూటమికి తిరిగి కళ్ళుమూసుకొని పట్టం కడతారు

  15. కెవలం 10% మాత్రమె రెషన్ బియ్యం తినెటట్టు అయితె మరి జగన్ అన్నయ్య…

    ఈ పదకం ఎందుకు ఉంచాడు?

    అంత కర్చు పెట్టి ఇంటిటికీ రవాణా కొసం అంటూ మళ్ళి వ్యాన్స్ ఎందుకు కొన్నాడు?

    మళ్ళి డ్రైవర్జీ జీతాలు పెట్రొలు మరొ కర్చు ఎందుకు?

    .

    అప్పుడు చెప్పలెదె జగన్ కి ఎమి తెలుసు అంటూ ఈ సుద్దులు???

    1. మొత్తం మీద పెదల బీయం కూడా బొక్కె మన Y.-.C.-.P నాయకుల కొసం బీయ్యాం అలా అమ్ముకుంటుంటె చూస్తు ఉండాలా?

      ఎప్పుడైతె విదెశాలకి అమ్మలెరొ, అప్పుడు జనం నుండి కొనరు. అప్పుడు ఉచ్చిత బీయం అవసరం అయిన వారు మాత్రమె తీసుకుంటారు. ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపొయావు GA!

  16. Dharidram ga undhi article direct ga chepthav entra chip dobbindha

    Dheenni illegal panulu antaru

    Nuv rasedhi ela undhi ante evadaine rape chesthe kaamam ni aapukoledhu idhi prakruthi dharamam annattu undhi ne article

  17. ఈ వెంకీ గాడు ఉత్త ఎదవే గాని వీడు చెప్పిన దాంట్లో కొంత 
    నిజం ఉంది. మా ఊళ్ళో చాలమంది రేషన్ బియ్యాన్ని
    కోడికి daana ga వేస్తారు
  18. ఏదైనా వార్త రాయటం ఆలస్యం కూటమి కు క్క లు మొరుగుతూనే ఉంటాయి, వెళ్లి అమ్మలని తిట్టే పెపర్ చదువుకోండి

  19. ఇంత తెలిసిన వాడివి గత ప్రభుత్వంతో అంతగా అంట కాగిన నువ్వు వారికి ఈ విషయం ఎందుకు చెరవేయలేదు? కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్నే మీరు రూపాయికి కలో చొప్పున అమ్భుకున్నారా? ఆ రూపాయి బియ్యానికి ముప్పావలా కోడికి మూడు రూపాయల దిష్టి లాగా కొత్త ఆటోలు కొని ఇంటింటికి చేరవేస్తూ నానా హంగామా ఎందుకు చేసినట్టో? 20% మించి బియ్యాన్ని వాడరని తెలిసి ఇంత దండుగమారి ఖర్చు ఎందుకు చేసింది గత ప్రభుత్వం? ఏదేమైనా మీ పరువు మీరే తీసుకోవడంలో మిమ్మల్ని మించిన వారు లేరు అనేది అతిశయోక్తి కాదు.

Comments are closed.