రైల్వే జోన్ ఆశలకు మోడీ మార్క్ కలర్స్ …?

ప్రధాని నరేంద్ర మోడీ సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం విశాఖ వచ్చి ఇదిగో మీకు రైల్వే జోన్ వచ్చేసింది అని భారీ ప్రకటన చేశారు. ఆ తరువాత ఎన్నికలు జరగడం ఆయనే మళ్లీ దేశానికి ప్రధాని …

ప్రధాని నరేంద్ర మోడీ సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం విశాఖ వచ్చి ఇదిగో మీకు రైల్వే జోన్ వచ్చేసింది అని భారీ ప్రకటన చేశారు. ఆ తరువాత ఎన్నికలు జరగడం ఆయనే మళ్లీ దేశానికి ప్రధాని  కావడం జరిగాయి. కానీ రైల్వే జోన్ మాత్రం విశాఖకు ఈ రొజుకీ రాలేదు. ఇప్పటికీ జోన్ ఎక్కడ ఉంది అంటే అలాగే కాగితాల మీదనే ఉందనే చెబుతారు.

దీని మీద ఎవరు కేంద్రాన్ని ప్రశ్నించినా పరిశీలన దశలో ఉందని చెబుతారు. మరో సందర్భంలో విశాఖలో జోన్ కి ఫీజుబిలిటీ లేదు అని కూడా లీకులు ఇస్తూ ఉంటారు. ఇక మరో ఏణ్ణర్ధంలో ఎన్నికలు రాబోతున్నాయి. విశాఖ జోన్ కల సాకారం అవుతుందా అంటే మళ్ళీ బీజేపీ నేతలే చెబుతున్నారు. విశాఖకు జోన్ వచ్చి తీరుతుందని.

అదెప్పుడు అంటే అదిగో తొందరలోనే అని కూడా అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వచ్చి రైల్వే జోన్ కి సంబంధించిన జోనల్ హెడ్‌క్వార్టర్స్ ఆఫీస్ కాంప్లెక్స్‌కు త్వరగా శంకుస్థాపన చేస్తారు అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే జోనల్ ఆఫీస్ కి సరిపడా రైల్వే భూమి ఉంది. కేంద్రం నిధులు ఇచ్చింది అంటున్నారు. మరి మోడీ కాకపోతే పాయె ఎవరో ఒకరు శంకుస్థాపన చేసి సత్వరమే ప్రారంభించే విషయంలో ఎందుకో ఈ ఆలస్యం అనవసర జాప్యం చేస్తున్నారు  అంటే మాత్రం జవాబు ఉండదు.

అయితే 2019 ఎన్నికల క్రితం జోన్ వచ్చిందని చెప్పిన ప్రధానే మళ్లీ ఎన్నికలు దగ్గరపడే వేళకు విశాఖ వచ్చి జోనల్ ఆఫీస్ కి కూడా శంకుస్థాపన చేస్తారేమో. మరి అది ఎపుడు పూర్తి అవుతుందంటే మరిన్ని లోక్ సభ ఎన్నికలు రావాలేమో అన్న మాట అయితే రైల్వే కార్మిక వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది.