దారుణం.. కన్నతల్లి కాదు, నరరూప రాక్షసి

ఏలూరులో దారుణం జరిగింది. రెండో పెళ్లి చేసుకున్న ఓ మహిళ, తన ఇద్దరు కూతుళ్లను భర్తకు అప్పగించింది. వాళ్ల ద్వారా సంతానాన్ని పొందాలని చెప్పింది. సభ్యసమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటన వట్లూరు గ్రామ…

ఏలూరులో దారుణం జరిగింది. రెండో పెళ్లి చేసుకున్న ఓ మహిళ, తన ఇద్దరు కూతుళ్లను భర్తకు అప్పగించింది. వాళ్ల ద్వారా సంతానాన్ని పొందాలని చెప్పింది. సభ్యసమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటన వట్లూరు గ్రామ పంచాయతీ పరిథిలో జరిగింది.

ఈ ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు. భర్త చనిపోవడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుంది. అలా ఆ కుటుంబంలోకి ప్రవేశించాడు పుట్టా సతీష్ కుమార్. తనకు పిల్లలు కావాలని కోరాడు సతీష్. అయితే అప్పటికే మహిళకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయింది.

దీంతో తన ఇద్దరు పిల్లల ద్వారా సంతానాన్ని కనాలని ఆ మహాతల్లి ఆఫర్ ఇచ్చింది. 8వ తరగతి చదువుతున్న అభంశుభం తెలియని తన కూతుర్ని, తన రెండో భర్త వద్దకు పంపించింది. అలా మైనారిటీ తీరకుండానే ఆ చిన్నారి తల్లయింది. అయితే చిన్న వయసు కావడం, పైగా చుట్టుపక్కల వాళ్లకు తెలుస్తుందేమో అనే భయంతో ఆమెకు అబార్షన్ చేయించారు.

ఆ తర్వాత రెండేళ్లు ఆగి, పదో తరగతి వచ్చిన తర్వాత ఆమెను మరోసారి గర్భవతిని చేశాడు సతీష్. ఆమె 2021లో పాపకు జన్మనిచ్చింది. అయితే తనకు మగబిడ్డ కావాలని సతీష్ పట్టుబట్టాడు. దీంతో తన రెండో కూతుర్ని, భర్త వద్దకు పంపించిన భార్య.

ఈసారి రెండో కూతురు కూడా గర్భందాల్చింది. ఆమెకు ఇంట్లోనే డెలివరీ చేశారు. ఈ విషయంలో యూట్యూబ్ వీడియోలు చేసి డెలివరీ ఎలా చేయాలో నేర్చుకుంది ఆ తల్లి. అయితే మృత శిశువు జన్మించడంతో కాలువలో పడేశాడు సతీష్.

ఓవైపు ఇలా సాగుతుంటే, మరోవైపు సదరు మహిళకు భర్తతో మనస్పర్దలు తలెత్తాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అసలు విషయం మేనమామకు తెలిసింది. వెంటనే పిల్లలిద్దర్నీ తన పర్యవేక్షణలోకి తీసుకున్నాడు. ఏలూరు దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కంప్లయింట్ తీసుకున్న పోలీసులు, సదరు మహిళను, ఆమె భర్త సతీష్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.