పురందేశ్వ‌రిపై వైసీపీ ఫ‌స్ట్ ఎటాక్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ నూత‌న అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రిపై వైసీపీ నుంచి ఫ‌స్ట్ ఎటాక్ మొద‌లైంది. నూత‌న అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆనందంలో ఆమె వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ నూత‌న అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రిపై వైసీపీ నుంచి ఫ‌స్ట్ ఎటాక్ మొద‌లైంది. నూత‌న అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆనందంలో ఆమె వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమెకు వైసీపీ నుంచి కౌంట‌ర్ ఎదురైంది. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలను వైసీపీ ప్ర‌భుత్వం త‌మ ఖాతాలోకి వేసుకుంద‌ని పురందేశ్వ‌రి ఆరోపించ‌డాన్ని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త‌ప్పు ప‌ట్టారు.

ఈ మేర‌కు ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా పురందేశ్వ‌రికి స్ట్రాంగ్ ఆన్స‌ర్ ఇచ్చారు. అదేంటో చూద్దాం. “కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల క్రెడిట్ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏపీ ప్ర‌భుత్వానికి లేదు. ఏపీకి రావాల్సిన నిధులు, పార్ల‌మెంట్ సాక్షిగా హామీ ఇచ్చిన ప్ర‌త్యేక హోదా ఇవ్వాలి. హోదా ఇవ్వండి…ఆ క్రెడిట్ అంతా మీకే ఇస్తాం. రైల్వేజోన్ మంజూరు చేయాలి. వైజాగ్ స్టీల్ ప్ర‌యివేటీక‌ర‌ణ ఆపండి. పోల‌వ‌రం ప్రాజెక్ట్‌, చెన్నై-వైజాగ్ కారిడార్ పూర్తి చేయండి. రైతు సంక్షేమానికి మ‌ద్ద‌తు ఇవ్వండి” అని ఆయ‌న ట్వీట్ చేశారు.  

వైసీపీ ప్ర‌భుత్వంపై ఘాటు విమ‌ర్శ‌లు చేసినా త‌మ‌ను ఏమీ అన‌లేర‌నే భావ‌న బీజేపీ నేత‌ల్లో వుంది. అందుకే పురందేశ్వ‌రి బాధ్య‌త‌లు తీసుకున్న మొద‌టి రోజే జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు గుప్పించి, ఎల్లో బ్యాచ్ క‌ళ్ల‌లో ఆనందం నింపారు. పురందేశ్వ‌రి విమ‌ర్శ‌ల‌కు విజ‌య‌సాయిరెడ్డి వైసీపీ త‌ర‌పున మొట్ట‌మొద‌ట‌గా స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. రానున్న రోజుల్లో పురందేశ్వ‌రిపై వైసీపీ స్టాండ్ ఏంటో విజ‌య‌సాయిరెడ్డి త‌న ట్వీట్ ద్వారా చెప్ప‌క‌నే చెప్పారు.