టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను సోషల్ మీడియా ఏకిపారేస్తోంది. అనిత అభ్యంతరకర కామెంట్స్ నెటిజన్లకు కోపం తెప్పించాయి. ఈ సందర్భంగా అనిత కామెంట్స్ గురించి చర్చిస్తూ, తాము కూడా పచ్చిగా మాట్లాడ్తామంటూ నెటిజన్లు కీలక ప్రశ్నలు తెరపైకి తేవడం గమనార్హం. అనిత ఉద్దేశం ఏంటో తెలియదు కానీ, ఆమె హద్దు దాటి విమర్శలకు పాల్పడుతున్నారని గత కొంత కాలంగా ఆమెపై నెటిజన్లు రగిలిపోతున్నారు.
పింఛన్ ఇవ్వాలంటే తమ వద్ద పడుకోవాలని వాలంటీర్లు అడుగుతున్నారని అనిత సంచలన ఆరోపణ చేశారు. “వాలంటీర్ల గురించి నేను పచ్చిగా చెబుతా. పింఛన్ కావాలంటే నా దగ్గర పడుకుంటావా? అని అడుగుతున్నారు. ఆఖరికి ఇంటి స్థలం కావాలంటే నాకేంటని అడుగుతున్నారు” అని అనిత చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాము కూడా పచ్చిగా అడుగుతున్నామని… టీడీపీలో ఎమ్మెల్యే లేదా ఏదైనా పదవి ఇవ్వాలంటే ఎలాంటి కమిట్‌మెంట్ అడుగుతున్నారో అనితా మీరు చెబుతారా? మేము చెప్పాలా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీలో మహిళలపై సాగుతున్న లైంగిక వేధింపుల గురించి, ఆ పార్టీని వీడిన పలువురు నాయకురాళ్లు చెప్పిన విషయాల్ని తెరపైకి తెస్తున్నారు. అదేంటో గానీ, అనితకు శ్వేతాచౌదరి తనకు పోటీగా వస్తుందనే భయం పట్టుకున్నట్టుందని, అందుకే హద్దులు దాటి మాట్లాడుతోందని విమర్శిస్తున్నారు.
పింఛన్ తీసుకునే మహిళల వయసు 60కి పైబడి వుంటుందని, వాలంటీర్లకు 25 నుంచి 35 ఏళ్ల లోపు వుంటాయని, చాలా చోట్ల మహిళలున్నారని, ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా అనిత నోటికొచ్చినట్టు మాట్లాడ్డం ఆమెకే చెల్లిందని చీవాట్లు పెడుతున్నారు.
టీడీపీలో మహిళలు రాణించాలంటే ఎలా వ్యవహరించాలో ఒక్కసారి దివ్యవాణి, సాధినేని యామినీ శర్మ , కృష్ణవేణి తదితరులను అడిగితే అనితతో పాటు ఆ పార్టీ నాయకుల బాగోతాలన్నీ కథలుకథలుగా చెబుతారనే ఘాటు వ్యాఖ్యలు నెటిజన్ల నుంచి రావడం చర్చనీయాంశమైంది. ఇలా అనితను ఆమె మాటల్లోనే పచ్చిగా చెబుతామంటూ నెటిజన్లు ఏకిపారేయడం గమనార్హం.