కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన విద్యార్థి చదువు బాధ్యతల్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీసుకున్నారు. శబరి మానవత్వం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చినవంగలిలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్త, వారి ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రాణాలు విడిచిన వారిలో గురుశేఖర్‌రెడ్డి (45), దస్తగిరమ్మ (38) దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి(10) ఉన్నారు.
వీరి కుటుంబంలో మొత్తం ఐదుగురు ఉన్నారు. రెండో కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులో ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు, అక్క, చెల్లి చనిపోయిన విషయం తెలిసి ఆ విద్యార్థిని స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబ సభ్యుల మృతదేహాల్ని చూసి కన్నీరుమున్నీరైంది. ఇక తనకు రక్త సంబంధీకులెవరూ లేరనే విషయాన్ని ప్రసన్న జీర్ణించుకోలేకపోతోంది.
బాధిత విద్యార్థినితో ఎంపీ శబరి మాట్లాడి ఓదార్చారు. తానున్నానని, భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఉన్నత చదువులు పూర్తయ్యే వరకూ తానే బాధ్యత తీసుకుంటానని శబరి చెప్పారు. కుటుంబ సభ్యులు లేరనే బాధ ఉన్నప్పటికీ, అండగా తాముంటామని ప్రసన్నకు శబరి మనో ధైర్యం కల్పించారు.
ayyo talli enta kastamochindi andaru chanipovadamaa… Pata midde lo endukunnaro… Govt need to check old houses give them new houses please
శెభాష్ శభరి గారు.. This is called LEADERSHIP