పీక్స్ కి చేరిన ఎంపీ ఎమ్మెల్సీ మాటల యుద్ధం!

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ కి మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరుకుంది. ఎంపీ ఓటమి కోసమే తాను కృషి చేస్తాను అని…

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ కి మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరుకుంది. ఎంపీ ఓటమి కోసమే తాను కృషి చేస్తాను అని వంశీ ఇప్పటికే చెప్పారు. విశాఖ తూర్పు నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఎంవీవీ ఎలా గెలుస్తారో చూస్తాను అని సవాల్ చేశారు. ఆయన రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల తేడాతో భారీ ఓటమిని చూస్తారు అని హెచ్చరించారు. తాను ఎంవీవీని వదిలేది లేదు వెంటాడుతాను అని వార్నింగ్ ఇచ్చారు.

ఎన్నికల తరువాత జనసేన- టీడీపీ ప్రభుత్వంలో తొలి విచారణ ఎంపీ ఎంవీవీ మీదనే ఉంటుందని కూడా ప్రకటించారు. ఇలా తీవ్రమైన వ్యాఖ్యలు ఎమ్మెల్సీ వంశీ ఎంపీ మీద చేశారు. దానికి ఎంపీ ఎంవీవీ అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యారు.

తన మీద చేసిన కామెంట్స్ కి ఆయన ఫైర్ అయ్యారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ఇంటికి వెళ్ళి మరీ కొడతాను అని వంశీకి హెచ్చరించారు. తన పరువు ప్రతిష్టలకు వంశీ భంగం కలిగించారు అని విశాఖలో పోలీసులకు ఎంపీ ఫిర్యాదు కూడా చేశారు.

తన మీద ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేయడమేంటి అని వంశీ మీద ఎంపీ ఎంవీవీ మండిపోతున్నారు. తనను ఓడగొట్టడమే లక్ష్యం అని చెప్పిన ఎమ్మెల్సీ మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు ఎంపీ ఎమ్మెల్సీ మధ్య వార్ కొత్త రూపు దాలుస్తోంది.

ఇద్దరూ డైరెక్ట్ అయిపోయారు. ఎంపీ ఎంవీవీ ఎలా ఎమ్మెల్యే అవుతారో తాను చూస్తాను అని వంశీ ఓపెన్ చాలెంజ్ చేస్తూంటే తనను ఓడించేది ఎవరు అంటూ ఎంవీవీ అంటున్నారు. వైసీపీలో ఈ ఇద్దరి మధ్య పోరు అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. చివరికి వంశీ పార్టీని వీడారు. తాను పార్టీని వీడడానికి ఎంపీ ఎంవీవీ మాత్రమే కారణం అని అనేకసార్లు వంశీ చెప్పుకొచ్చారు. ఆయన ఓటమిలోనే తన గెలుపు అని కూడా అంటున్నారు. ఈ ఇద్దరు మధ్య యుద్ధం టీడీపీ జనసేన బాగా ఎంజాయ్ చేస్తున్నాయి.

జనసేనకు అప్పనంగా ఒక ఎమ్మెల్సీ సీటు దక్కింది. టీడీపీ తరఫున ఇప్పటికే మూడుసార్లు గెలిచిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడికి నాలుగవసారి సునాయాసంగా గెలుపు సాధ్యపడుతోంది. ఈ ఇద్దరికీ రాజీ కుదిర్చి తమతో పాటు ఉంచుకోలేని వైసీపీ నాయకత్వం అసమర్ధత పుణ్యమే ఇదంతా అని అంటున్నారు.