నాదెండ్ల వారి కామెడీ: నమ్మేవాళ్లుంటే చాలు..

ప్రతి ఒక్కరికీ తమ గురించి తాము అతిగా ఊహించుకోవడం అలవాటుగా ఉంటుంది. రాజకీయాల్లో బహుశా ఇది కాస్త జాస్తిగా కూడా ఉంటుంది. నిత్యం భజనపరులు, భజంత్రీలు చుట్టూతా తిరుగుతూ ఉండే సినిమా రంగంనుంచి వచ్చిన…

ప్రతి ఒక్కరికీ తమ గురించి తాము అతిగా ఊహించుకోవడం అలవాటుగా ఉంటుంది. రాజకీయాల్లో బహుశా ఇది కాస్త జాస్తిగా కూడా ఉంటుంది. నిత్యం భజనపరులు, భజంత్రీలు చుట్టూతా తిరుగుతూ ఉండే సినిమా రంగంనుంచి వచ్చిన పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో ఈ పోకడ ఇంకాస్త ఎక్కువగా కూడా ఉండొచ్చు. అయితే ఆ పార్టీలో అంతో ఇంతో నేలమీద ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్ మాత్రమేనేమో అనిపిస్తోంది. 

ఎందుకంటే.. ‘ఎవ్వరైనా సరే మనకు సీఎం సీటు ఎందుకిస్తారు బాస్’ అని ఆయనే తేల్చేస్తున్నారు. 40-50 సీట్లు గెలిస్తే సీఎం సీటు అడగొచ్చు.. అయినా అది మనకెందుకు వస్తుంది.. అని తమ పార్టీ ఆ మాత్రం సీట్లలో నెగ్గడం అసాధ్యం అని ఆయన ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఉన్నారు. కానీ నేల మీద లేకుండా.. తమ గురించి అతిగా ఊహించుకుంటున్న వారిలో ఆపార్టీ నాదెండ్ల మనోహర్ ముందు వరుసలో ఉన్నారు. 

అధికార పార్టీ ఒక సక్సెస్‌ఫుల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అందులో కొత్తదనం ఏమీ లేదని అది తమ కార్యక్రమానికి కాపీ అని అందరూ క్లెయిం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏదో క్యాంపు ఆఫీసు దాకా తీర్థంగా వచ్చిన వారు మాత్రమే కాదు.. రాష్ట్రంలోని ఏ మూలన ఉన్న ఏ నిరుపేద అయినా తమ సమస్యను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే పథకం ఇది. పైగా తాము నివేదించుకున్న సమస్య తాలూకు అప్డేట్ ఏమిటో వారికి ఎప్పటికప్పుడు తెలుస్తుంది కూడా. ప్రజల్లో నేరుగా ముఖ్యమంత్రి జగన్ మీద నమ్మకాన్ని పెంచే ఆలోచన ఇది. 

అయితే సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్ అనే సామెత చందంగా .. ఈ ఆలోచన నాదంటే నాదని తెలుగుదేశం, జనసేన కొట్టుకుంటున్నాయి. చంద్రబాబు అమలు చేసిన ఆలోచనకు ఇది మరో రూపం అని వాళ్లు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు జనసేన వంతు వచ్చింది. పవన్ కల్యాణ్ నిర్వహించిన జనవాణి కార్యక్రమాన్ని కాపీ కొట్టి జగన్ ఇప్పుడు ‘జగనన్నకు చెబుదాం’ అనేదాన్ని ప్రారంభించారని నాదెండ్ల మనోహర్ అంటున్నారు. మరోవైపు ఇది స్పందన కార్యక్రమమే కదా అని మెటికలు విరుస్తున్నారు. ఆ కార్యక్రమానికి కీర్తి వస్తుండే సరికి దాన్ని డైవర్ట్ చేయడానికి అందరూ నానా పాట్లు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. 

నాదెండ్ల మనోహర్ ఇంకో విషయంలో తమ పార్టీ కార్యకర్తలను అలర్ట్ చేస్తున్నారు. జనసైనికుల, సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందట. అందరూ తొలగించిన ఓట్లు తిరిగి పొందుపరిచేలా కష్టపడాలట. కామెడీ ఏంటంటే.. అసలు జనసేన ఓట్లు అంటూ ఎన్ని ఉన్నాయి అని? ఒకవైపు పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో మన పార్టీకి 200, 500 ఓట్లు కూడా రాలేదు అని దీనంగా పలుకుతోంటే.. మరోవైపు మా ఓట్లను తొలగించేస్తున్నారు అని నాదెండ్ల అనడం కామెడీగా ఉంది.