మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు బూతులు పక్కకు పోయాయి. నర్సీపట్నంలో రెండు సెంట్ల పంట కాలువను ఆక్రమించి అయ్యన్న ఇల్లు నిర్మించుకున్నారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అయ్యన్న కుటుంబ సభ్యులకు నోటీసు ఇచ్చారు. వెంటనే ఇంటి గోడను కూల్చేశారు. ఇంకేం, ఎల్లో టీంకు కావాల్సినంత మేత దొరికినట్టైంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రధాన ప్రతిపక్షానికి చెందిన చిన్నాచితకా అనే తేడా లేకుండా అన్ని స్థాయిల్లోని నాయకులు విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో జగన్‌పై మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు చేశారు. లోకేశ్‌పై నెటిజన్లు తమదైన స్టైల్‌లో కౌంటర్లు ఇచ్చారు.
“నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడింది. మూడేళ్ల తర్వాత కూడా విపక్ష నేతల ఇళ్లు కూల్చుతున్నారు. అరెస్టులనే నమ్ముకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దుస్థితి చూస్తుంటే జాలి వేస్తోంది. ప్రజావ్యతిరేకత చూసి ఆయన జడుసుకున్నారు అని లోకేశ్ విమర్శలు గుప్పించారు.
“అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం పులోగిలో కాసేపు పక్కన పెడదాం. ఇంతకూ తమరెవరో లోకానికి చెప్పండి లోకేశ్” అని నెటిజన్లు సెటైర్స్ విసిరారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో వైసీపీ నేతలను చూడగానే పారిపోయిన నాయకుడిని ఏమని పిలవాలి? మంగళగిరి పిల్లినా లేక చంద్రగిరి పిల్లి అని పిలవాలా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించడం గమనార్హం.
ఎదురుగా ప్రత్యర్థులు లేకపోతే ఉత్తరకుమారుడు ఎన్నైనా మాట్లాడ్తాడని నెటిజన్లు లోకేశ్‌ను దెప్పి పొడిచారు.