వైసీపీ నంబర్ 2, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్లు హద్దులు దాటుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. విధానాల పరంగా, రాజకీయంగా ఘాటుగా స్పందించినా ఎవరూ పట్టించుకోరు. కానీ విజయసాయిరెడ్డి ట్వీట్లలో ప్రత్యర్థులపై విమర్శలు మోతాదుకు మించిన డోస్ కనిపిస్తోంది. ఇది సొంత పార్టీ వాళ్లకు కూడా రుచించడం లేదు. విజయ సాయిరెడ్డి తీరు అంతే అని ప్రత్యర్థులు, సొంతవాళ్లు కూడా పట్టించుకోనట్టు కనిపిస్తోంది. అయితే విజయసాయిరెడ్డిని ఆదర్శంగా తీసుకుని రీట్వీట్లు చేస్తుండడం గమనార్హం.
లోకేశ్, చంద్రబాబులపై ట్విటర్ వేదికగా విజయసాయి రెచ్చిపోతున్నారు. శుక్రవారం తీవ్ర అభ్యంతరకర ట్వీట్‌పై చర్చ ముగియకనే, మరో ఘాటు ట్వీట్ ఆయన చేయడం గమనార్హం. ఇది లోకేశ్ ట్వీట్‌కు కౌంటర్ కావడం విశేషం.
“ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానని పులిలా గర్జించిన జగన్… కేసుల మాఫీ కోసం ప్రధాని ఎదుట సార్ సార్ అంటూ పిల్లిలా ప్రాథేయపడ్డాడు. టెన్త్ పేపర్స్ ఎత్తుకెళ్లిన కేసులో అరెస్టయిన జగన్‌రెడ్డి, డిగ్రీ ఎక్కడ చదివాడో ఎవరికీ తెలియదు” అంటూ లోకేశ్ ఓ పనికిమాలిన ట్వీట్ చేశారు. దీనికి విజయసాయిరెడ్డి కౌంటర్ ఏంటో చూద్దాం.
“హోదాను తాకట్టుపెట్టి ప్యాకేజీ చాలన్న కేబినెట్లో నువ్వు కూడా మంత్రివి కదరా చెత్త నాకేష్! 14 ఏళ్లు సిఎంగా ఉండి జగన్ గారి చదువులపై నీ బాబు దర్యాప్తు జరిపించ లేకపోయాడా? నీ టెన్త్, ఇంటర్ పేపర్లు ఇప్పటికీ మిస్సింగే! ఒక్కో ఎగ్జామ్ ఒకరు రాశారంట. నవరంధ్రాలు మూస్కో. సౌండ్ పెంచమాకు” అంటూ విరుచుకుపడ్డారు. నువ్వు కూడా మంత్రివి కదరా చెత్త నాకేశ్, నవరంధ్రాలు మూస్కో అంటూ తీవ్ర అభ్యంతరకర కామెంట్స్ చేయడం విజయసాయికే చెల్లింది. అలాగే శుక్రవారం లోకేశ్‌పై విజయసాయిరెడ్డి చేసిన అభ్యంతరకర ట్వీట్ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది.