కర్ణాటక రాజకీయం గత కొన్ని దశాబ్దాలుగా రాసలీలల మయం అయ్యింది. అసెంబ్లీలో బ్లూ ఫిల్మ్ లను చూడటంతో మొదలుపెడితే, ఆ మధ్య ఒక భారతీయ జనతా పార్టీ నేత ఒక అమ్మాయితో గడిపిన వైనాన్ని వీడియోగా తీసుకుని దుమారం రేపాడు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను చీల్చుకుని వచ్చి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే ఒకరు రేపిన ఆ దుమారాన్ని మరవకముందే.. ఇప్పుడు సీఎం పీఏ హనీట్రాప్ లో చిక్కుకోవడం గమనార్హం.
సీఎం బవసరాజ్ బొమ్మై పీఏ ఒకరు ఒక మహిళతో గడిపాడని, ఆమె ద్వారా కొందరు ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని సీఎం ఆఫీసు నుంచి కీలక పత్రాలను సంపాదించారని, అంతేగాక అతడిని బ్లాక్ బెయిల్ చేస్తూ అక్రమ సంపాదనలు కూడా చేశారనే వార్తలు వస్తున్నాయి.
దీనిపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తూ ఉంది. ఇలాంటి వ్యవహారాల్లో చిక్కుకోవడం కర్ణాటక బీజేపీకి కొత్త కాదు. అసెంబ్లీలో కూర్చుని బ్లూ ఫిల్మ్ లు చూస్తూ కమలం పార్టీ నేతలు వీడియోల్లో దొరికారు కొన్నేళ్ల కిందట. అలాంటి వారిని అప్పట్లో సస్పెండ్ చేసిన కమలం పార్టీ, ఇటీవల వారిలో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కట్టబెట్టింది!
ఆ తర్వాత యువతితో రాసలీలల వీడియోతో వార్తల్లోకి ఎక్కిన ఎమ్మెల్యేను ప్రభుత్వం కాపాడుకోవడంలో భాగంగా కనీసం ప్రశ్నించలేదు. మరి ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా.. బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఇలాంటి వ్యవహారాలతో బిజీగా ఉంటే.. సీఎం పీఏ కూడా ఇలాంటి వ్యవహారంలో చిక్కుకోవడం పెద్ద వింత కాదు. అయినా ఈ రాసలీలల రాజకీయం కర్ణాటకకు అలవాటైపోయింది కూడా!