ఎన్నో త్యాగం చేసావు నాన్నాః నారా రోహిత్‌

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి త‌మ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడి మ‌ర‌ణాన్ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు జీర్ణించుకోలేకున్నారు. ఈ సంద‌ర్భంగా రామ్మూర్తి త‌న‌యుడైన టాలీవుడ్ హీరో నారా రోహిత్ త‌న తండ్రికి వీడ్కోలు ప‌లుకుతూ భావోద్వేగ…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి త‌మ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడి మ‌ర‌ణాన్ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు జీర్ణించుకోలేకున్నారు. ఈ సంద‌ర్భంగా రామ్మూర్తి త‌న‌యుడైన టాలీవుడ్ హీరో నారా రోహిత్ త‌న తండ్రికి వీడ్కోలు ప‌లుకుతూ భావోద్వేగ పోస్టును ఎక్స్‌లో పెట్టారు. ఆ పోస్టులో ఏముందో తెలుసుకుందాం.

“నువ్వు గొప్ప పోరాట యోధుడివి నాన్న. నా మీద చూపించిన ప్రేమను ఎప్ప‌టికీ మర్చిపోలేను. జీవితంలో క‌ష్ట‌న‌ష్టాలను ఎలా ఎదుర్కోవాలో నాకు నేర్పించావు. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది నీ చ‌లువే. నాకు మంచి జీవితాన్ని ఇచ్చావు. మా కోసం నీ జీవితంలో ఎన్నో దూరం చేసుకున్నావు, మరెన్నో త్యాగం చేసావు. నీ త్యాగలే మా జీవితాల్లో వెలుగులు నింపాయి. నాన్న నీతో గడిపిన జ్ఞాపకాలు నాకు ముఖ్యమైనవి. జీవితాంతం వాటిని గుర్తు చేసుకుంటూ బ‌తుకుతాను. నిన్ను చాలా మిస్ అవుతున్నాం. బై నాన్న” అంటూ తండ్రికి నారా రోహిత్ అంతిమ వీడ్కోలు ప‌లికారు.

నారా రోహిత్‌కు ఇటీవ‌ల నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. మ‌రో నెల‌లో ఆయ‌న పెళ్లి జ‌ర‌గాల్సి వుండింది. ఈ లోపే ఆయ‌న కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నారావారిప‌ల్లెలో రామ్మూర్తినాయుడి అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఆయన కుటుంబ స‌భ్యులంతా నారావారిప‌ల్లెకు చేరుకుని తుది వీడ్కోలు ప‌లికారు. త‌మ్ముడి కుమారుల్ని ఆయ‌న ఓదార్చారు.

5 Replies to “ఎన్నో త్యాగం చేసావు నాన్నాః నారా రోహిత్‌”

  1. అన్నింటికీ మించి ఆ దేవుడు నీకు చంద్రబాబు లాంటి గొప్ప పెదనాన్నను, ఆ పెదనాన్నకు ఎన్టీఆర్ లాంటి గొప్ప మామను ఇచ్చాడు. జై చంద్రబాబు.. జై జై ఎన్టీఆర్

Comments are closed.