‘మేం నమ్మం దొర’ అనేది అత్యంత ఫేమస్ మీమ్. ఎవరైనా నమ్మశక్యం కాని ప్రకటన చేసినప్పుడు సోషల్ మీడియాలో ఈ మీమ్ వాడుతుంటారు. ఇప్పుడిదే మీమ్ తో బన్నీపై ట్రోలింగ్ నడుస్తోంది. దీనికి కారణం అతడు ఇచ్చిన ఓ స్టేట్ మెంట్.
పుష్ప-1 సినిమా తర్వాత పుష్ప-2 చేయడానికి సరిగ్గా మూడేళ్లు టైమ్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఓ సీక్వెల్ చేయడానికే మూడేళ్లు టైమ్ తీసుకున్న ఈ హీరో.. ఇకపై రెండేళ్లకు మూడు సినిమాలు చేస్తానని ప్రకటించి షాక్ ఇచ్చాడు. అందుకే పైన చెప్పుకున్న మీమ్స్ తో సెటైర్లు పడుతున్నాయి.
చాలామంది నెటిజన్లు ఇలా సెటైర్లు వేయడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. పుష్ప-2 తర్వాత త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు బన్నీ. ఇది ఆషామాషీ సినిమా కాదు. దాదాపు 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో, కనీవినీ ఎరుగని రీతిలో వస్తోంది.
ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో పడ్డాడు దర్శకుడు త్రివిక్రమ్. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. అది ఎప్పటికి పూర్తవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే, ఎలాంటి డెడ్ లైన్స్ పెట్టుకోకూడదని ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కాబట్టి.
ఓవైపు ఇంత తతంగం నడుస్తుంటే, మరోవైపు రెండేళ్లకు 3 సినిమాలు తప్పకుండా చేస్తానంటూ బన్నీ చెప్పడం చాలామందికి పెద్ద కామెడీలా తోచింది. అందుకే సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది.
vc available 9380537747
vc estanu 9380537747
Call boy works 9989793850
nuvvu allu arjun ni baga ethuthunnavura
రేపు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ అంటే చాలు… రివర్స్ గేర్ వేస్తారు GA గారు
Next cm pawankalyan
ఆ కోరిక ఆయనకే లేదు. కాలమే సమాధానం చెప్పాలి దీనికి