ఆ 40 సినిమాల హీరో ఎవరు?

రానా చాన్నాళ్ల కిందటే కెరీర్ స్టార్ట్ చేశాడు. కానీ సినిమాలు చాలా తక్కువ చేశాడు. ఇదే విషయాన్ని ఓ హీరో ప్రస్తావించాడట. అతడితో పాటు కెరీర్ ప్రారంభించిన ఈ హీరో 40 సినిమాలు చేస్తే,…

రానా చాన్నాళ్ల కిందటే కెరీర్ స్టార్ట్ చేశాడు. కానీ సినిమాలు చాలా తక్కువ చేశాడు. ఇదే విషయాన్ని ఓ హీరో ప్రస్తావించాడట. అతడితో పాటు కెరీర్ ప్రారంభించిన ఈ హీరో 40 సినిమాలు చేస్తే, రానా మాత్రం 12 సినిమాలు చేశాడు.

అయితే 40 సినిమాలు చేసిన ఆ హీరో కంటే, 12 సినిమాలు చేసిన తనే బెటర్ అనే విధంగా స్పందించాడు రానా. దానికి అతడు చెప్పిన లాజిక్ ఇది.

“రీసెంట్ గా ఓ హీరోను కలిశాను. అటుఇటుగా మేమిద్దరం ఒక ఏడాది గ్యాప్ లో కెరీర్ స్టార్ట్ చేశాం. ఆయన 40 సినిమాలు చేశాడు. నేను 12 మాత్రమే చేశాను. ఇదే విషయాన్ని ఆ హీరో గుర్తుచేశాడు. అక్కడే మరో వ్యక్తి ఉంటే ఆయనతో చిన్న క్విజ్ పెట్టాం. మా సినిమాల్లో ఎక్కువ ఆయనకు గుర్తున్నాయో చెప్పమన్నాం. నా 12 సినిమాల్లో ఆయనకు 10 గుర్తున్నాయి. 40 సినిమాలు చేసిన హీరో ఫిల్మోగ్రఫీ నుంచి నా కంటే తక్కువ సినిమాలు గుర్తున్నాయి ఆయనకి. నా సినిమాల్లో 80శాతం గుర్తున్నాయి. అది చాలు నాకు. జనాలు గుర్తుపెట్టుకోలేని 100 సినిమాలు చేసి ఏంటి ఉపయోగం?”

రానా చెప్పిన లాజిక్ బాగుంది కానీ, ఆ 40 సినిమాల హీరో ఎవరనే చర్చ ఇప్పుడు మొదలైంది. నిజంగా ఆ హీరో కెరీర్ లో చెప్పుకోడానికి పట్టుమని 10 సినిమాలు కూడా లేవా అనేది ఇప్పుడు అందరి ప్రశ్న. మరోవైపు ఐఫా అవార్డుల వేదికపై ‘బచ్చన్’ పేరిట తను వేసిన జోకులపై కూడా స్పందించాడు రానా. అందులో ఎలాంటి వివాదం లేదంటున్నాడు.

“పనిలేనివాళ్లు మొబైల్ ఫోన్లలో కేవలం క్లిప్ చూసి సృష్టించిన వివాదం అది. నేనేంటో హీరోలందరికీ తెలుసు. నాకు ఎవ్వరితో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అందరూ నన్ను ప్రేమిస్తారు. కేవలం సరదాగానే నేను మాట్లాడాననే విషయం అందరికీ తెలుసు. వాళ్లే దాన్ని హ్యూమర్ గా ఫీల్ అయినప్పుడు, మిగతా వాళ్లు చేసే కామెంట్స్ ను నేను పట్టించుకోను.”

అవార్డ్ ఫంక్షన్ లో యాంకరింగ్ చేస్తూ.. ఈ ఏడాది అమితాబ్ బచ్చన్ కెరీర్ లో ‘హై’ చూశారు, అలాగే ‘లో’ కూడా చూశారంటూ కామెంట్ చేశాడు. రానా దృష్టిలో ‘హై’ అంటే కల్కి, ‘లో’ అంటే మిస్టర్ బచ్చన్ అని అర్థం. దీనిపై హరీశ్ శంకర్ స్పందించాడు. “ఎన్నో విన్నాను.. అందులో ఇదోటి, అన్ని రోజూలు ఒకేలా ఉండవు, నాకైనా, ఎవరికైనా.. ” అంటూ స్పందించాడు.

6 Replies to “ఆ 40 సినిమాల హీరో ఎవరు?”

Comments are closed.