గతంతో పోలిస్తే నారా లోకేస్ చాలా స్లిమ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అదికారంలో ఉన్నప్పటితో పోలిస్తే లోకేష్ చాలా తగ్గారు! ఈ లుక్ చూసి తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు విపరీతంగా ఆనందించారు. లోకేష్ మారాడని, ఇక తిరుగులేదనేంత స్థాయిలో హడావుడి చేశారు.
ఇక ఇప్పుడు లోకేష్ సాహసోపేతమైన పాదయాత్రను చేపట్టారు. ఇది సాహసోపేతమని స్వయంగా అచ్చెన్నాయుడు వంటి వారే చెప్పారు. అయితే తెలుగు రాజకీయ చరిత్రలో ఆడవాళ్లే ఇంతకు మించిన సుదూర పాదయాత్రలు చేపట్టారు. మరి లోకేష్ చేపడితే అది సాహసం అని తెలుగుదేశం వాళ్లే అంటున్నారంటే, ఆయనను వారే తక్కువ అంచనా వేసినట్టుగా అవుతుంది. వారి దృష్టిలో లోకేష్ పరిస్థితి అది మరి.
ఆ సంగతలా ఉంటే.. పాదయాత్ర మొదటి రోజున లోకేష్ ప్రసంగాలను వింటే ఆయన నాలుక మందం మాత్రం ఇంకా తగ్గలేదని స్పష్టం అవుతోంది. మాటలు తడబాటు కొనసాగుతూ ఉంది. ముద్దగా వచ్చే వాయిస్ లో ఆయనేం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవడం కష్టం. లోకేష్ ప్రసంగాలకు సబ్ టైటిల్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతూ ఉంది.
ఒక పదంలో అక్షరాలనూ ఇటూ ఇటూ చేసి పలకడం, పదాలను ముద్దగా పలికేయడం కొనసాగుతూ ఉంది. మరి ఇది ఇంతటితోనే ఆగుతుందా లేక గతంలోలాగా సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఉరేసుకున్నట్టే, కులపిచ్చి మత పిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశమే అని సెలవిచ్చే వ్యవహారాలు కూడా ఉంటాయా? అనేది పాదయాత్రలో ఆయన సాగే కొద్దీ క్లారిటీ వస్తుంది.
ఎంతసేపూ రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఆ విమర్శల్లో కూడా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ పోతే లోకేష్ యథారీతిన కామెడీ అవుతారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తనేం మాట్లాడుతున్నారో తనే అర్థం చేసుకోలేని రీతిలో వ్యవహరిస్తున్నారు. రిగ్గింగు చేసుకోవడానికి తిరుపతికి వెళితే తనను అడ్డుకున్నారనడంతో మొదలుపెడితే చంద్రబాబు మాటల్లో గడబిడలు బోలెడన్ని ఉంటున్నాయి. లోకేష్ ఇప్పుడు తనకు అలవాటు లేని పనికి దిగాడు. మరి ఈయన విన్యాసాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయో!