నారాయణ బెయిల్ రద్దు..లొంగిపోవాలంటూ ఆదేశాలు!

నారాయ‌ణ విద్యాసంస్ధ‌ల అధినేత, మాజీ మంత్రి నారాయ‌ణకు చిత్తూరు జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. ప‌ద‌వ త‌ర‌గ‌తి పేప‌ర్ లీకుల కేసులో ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేసింది. నవంబర్ 30 లోపు పోలీసులకు లొంగిపోవాలంటూ…

నారాయ‌ణ విద్యాసంస్ధ‌ల అధినేత, మాజీ మంత్రి నారాయ‌ణకు చిత్తూరు జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. ప‌ద‌వ త‌ర‌గ‌తి పేప‌ర్ లీకుల కేసులో ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేసింది. నవంబర్ 30 లోపు పోలీసులకు లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

గ‌తంలో జ‌రిగిన‌ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ప్ర‌శ్నప‌త్రాలు లీకేజీలో నారాయ‌ణ హస్తం ఉంద‌ని చిత్తూరు జిల్లా పోలీసులు హైద‌రాబాద్ లోని నారాయ‌ణ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసి, న్యాయ‌మూర్తి ముందు హాజరుపరచగా అదే రోజే బెయిల్ వ‌చ్చింది. దీంతో చిత్తూరు పోలీసులు విచార‌ణ కోసం కోర్టును అశ్ర‌యించ‌గా కోర్టు బెయిల్ ర‌ద్దు చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది.

గత పదో తరగతి పరీక్షల్లో పలుచోట్ల అవకవతవకలు చోటుచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పరీక్షలు ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షమయ్యాయి. తిరుపతిలోని నారాయణ స్కూల్స్ బ్రాంచీలో టెన్త్ క్లాస్ తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది. నారాయణ స్కూల్ కి చెందిన గిరిధర్ అనే టీచర్ లీక్ చేశారని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి డీఈవో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గిరిధర్‌తో పాటు పలువురని పోలీసులు అరెస్ట్ చేశారు. 

మొత్తానికి మాజీ మంత్రి నారాయణ పోలీసుల ఎదుట హాజ‌ర‌వుతారా లేక పై కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకుంటారా అనేది వేచిచూడాలి.