ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సిని నటి, పూనమ్ కౌర్ పాల్గొనడంపై బీజేపీ చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. ఇంత వరకు వైయస్ఆర్, వైయస్ జగన్, చంద్రబాబు నాయుడు లాంటి వారు కూడా పాదయాత్రలు చేశారని, ఎప్పుడు పాదయాత్ర చేయాని బీజేపీ.. రాహుల్ ను విమర్శించే స్ధాయి లేదన్నారు.
ఇటీవల భారత్ జోడో యాత్రలో పాల్గొన్న పూనమ్ కౌర్ చేతిని రాహుల్ గాంధీ కావాలని పట్టుకోలేదని, వేరే ఉద్దేశంతో పబ్లిక్ లో ఎవరైనా అమ్మాయి చేయి పట్టుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆడవాళ్లను తల్లిగా చూస్తుందన్నారు. రాహుల్ చేయి పట్టుకున్న ఫోటోపై బీజేపీ చేస్తున్న విమర్శలు సిగ్గుచేటన్నారు. రాహుల్ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ గట్టిపడుతోందని దానిని చూసే బీజేపీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్న చేస్తోందన్నారు.
రాహుల్ యాత్ర పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సహం నింపుతోందని, కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా నాయకులను బతిమాలుకునే పరిస్ధితి లేదని.. ఎవరు ఎటువంటి తప్పులు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఎవరికి సీట్లు కేటాయిస్తే వారి గెలుపు కోసం ప్రయత్నిస్తామన్నారు.