ఏపీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన పల్లకీ మోయడానికి ఉవ్విళ్లూరుతున్న పవన్ కల్యాణ్.. అదే సమయంలో.. భారతీయ జనతా పార్టీ చంక దిగడానికి మాత్రం ఇష్టపడడం లేదు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ రెండు పార్టీలను ఛీకొట్టారు పవన్. సొంతంగా తొడకొట్టారు. రెండు నియోజకవర్గాల్లో ఆయనను ప్రజలు దారుణంగా ఛీకొట్టారు.
సవాళ్లు చేసినందుకు ఆయన తొడ వాచింది గానీ ఫలితం దక్కలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత.. తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఎంచక్కా ఎలాంటి మొహమాటం లేకుండా ఢిల్లీ వెళ్లి బిజెపి చంక ఎక్కి ‘ఎన్డీయే భాగస్వామి’ అనిపించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబుకు బోయీ అవతారం ఎత్తుతున్నారు. ఇలాంటి పవన్ వైఖరిని తాజాగా సీపీఐ నారాయణ దారుణంగా ఎండగట్టారు.
‘అధికారం కోసం అడ్డమైన గడ్డి తింటాం అంటే ఎలా’ అంటూ.. పవన్ కల్యాణ్ గురించి సీపీఐ నారాయణ వ్యాఖ్యానించడం ఇప్పుడు రచ్చ అవుతోంది. ప్రపంచంలోనే తిరుగులేని విప్లవనాయకుడిగా పేరున్న చేగువేరాను పవన్ అవమానించారని నారాయణ అంటున్నారు.
పవన్ కల్యాణ్ తాను చేగువేరా భావజాలానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా సినిమాల్లో.. తన వెనుక చేగువేరా పోస్టర్లు పెట్టుకుని బిల్డప్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే.. తన పసలేని రాజకీయ ప్రసంగాల్లో రాబోయే ఎన్నికలు.. విప్లవకారులకు- అక్రమ నాయకులకు మధ్య జరుగుతున్న పోరాటంగా పవన్ అమాయకంగా అభివర్ణించడం కూడా చేగువేరా భక్తి వల్లనే. అలాంటి విప్లవ నాయకుడిని తాను ఆరాధిస్తానని చెప్పుకునే పవన్.. చివరికి మతవాద భారతీయ జనతా పార్టీతో ఎలా చేతులు కలుపుతారంటూ సీపీఐ నారాయణ ప్రశ్నించడం విశేషం. ఈ చర్య ద్వారా.. పవన్ కల్యాణ్ తన మీద ఆశలు పెట్టుకున్న యువతరాన్ని నిస్పృహకు గురిచేశారని కూడా నారాయణ అన్నారు.
‘అధికారం కోసం గడ్డితింటారా’ అని ఆయన అనడమే తీవ్రమైన వ్యాఖ్య. కేవలం బిజెపి పట్ల వ్యతిరేకతతో ఉండే సీపీఐ జాతీయ కార్యదర్శి గనుక.. నారాయణ ఇలా మాట్లాడారని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. కేవలం బిజెపి – జనసేన జట్టుకట్టినంత మాత్రాన వారు ఏపీలో అధికారంలోకి రావడం కాదు కదా.. పట్టుమని పది సీట్లయినా నెగ్గగలరని అనుకోవడం భ్రమ.
కానీ పవన్ మాత్రం అర్జంటుగా అధికారం కావాలని తహతహలాడిపోతున్నారు. అందుకు ఆయన చేస్తున్న మరొక పని కూడా ఉంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. అందుకే సీపీఐ నారాయణ , తెలుగుదేశంతో పొత్తులకు చూపిస్తున్న ఉత్సాహాన్ని కూడా కలుపుకుని ఇలాంటి నింద పవన్ పై వేశారా.. అని పలువురు భావిస్తున్నారు.