పాన్ ఇండియా సినిమాలు మొదలు కావడంతో తెలుగు టాప్ హీరోల రెమ్యూనిరేషన్లు 100 కోట్లు దాటిపోయాయి. కానీ కేవలం తెలుగు వెర్షన్ కే హయ్యస్ట్ రెమ్యూనిరేషన్ తీసుకుంటూ టాప్ చైర్ లో కూర్చున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.
గుంటూరు కారం సినిమాకు మహేష్ బాబు రెమ్యూనిరేషన్ 78 కోట్లు ప్లస్ జిఎస్టీ అని తెలుస్తోంది. ఇది తెలుగు సింగిల్ లాంగ్వేజ్ సినిమా హీరో గా రికార్డు అని చెప్పాలి.
గుంటూరు కారం సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి. ఈ సినిమా టోటల్ మార్కెట్ నే 250 పైగా వుంటుందని ఇండస్ట్రీ అంచనా. నాన్ థియేటర్ హక్కుల రూపంలోనే 100 నుంచి 150 కోట్లు మధ్యలో ఆదాయం వుంటుందని అంచనాలు వున్నాయి.
అడియో హక్కులకే 20 కోట్లకు పైగా కోట్ చేస్తున్నారు. నైజాం థియేటర్ హక్కులే 45 కోట్లు చెబుతున్నారు. ఈ లెక్కన ఆంధ్ర థియేటర్ హక్కులు 60 వరకు చెప్పే అవకాశం వుంది. ఓవర్ సీస్ 20 కోట్లకు పైగా కోట్ చేస్తున్నారని వార్తలు వున్నాయి.
ఇవన్నీ లెక్కలు వేసుకుంటే టోటల్ మార్కెట్ 250 కోట్లకు పైగానే వుంటుంది. అందువల్ల మహేష్ కు ఈ రేంజ్ రెమ్యూనిరేషన్ ఇవ్వడంలో నిర్మాతకు నష్టం ఏమీ వుండదు.
త్రివిక్రమ్-మహేష్ అనే కాంబినేషన్ వల్లనే కదా ఇది అంతా. పైగా అలవైకుంఠపురములో సినిమా తరువాత వస్తోంది. ఈ సినిమా తరువాత మహేష్ సినిమా మరోటి థియేటర్లోకి రావాలంటే కనీసం ఏడాదిన్నర పడుతుంది. అందువల్ల అన్నీ కలిసి వచ్చాయి.