అయ్యన్న ఇలాకాలో ఎన్నికల ఉత్కంఠ

ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్శీపట్నం మునిసిపాలిటీలో చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికలు ఈ నెల 8న జరగనున్నాయి. వైసీపీకి ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ తో కలుపుకుని బలం 15 మంది ఉంటే టీడీపీ జనసేన…

ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్శీపట్నం మునిసిపాలిటీలో చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికలు ఈ నెల 8న జరగనున్నాయి. వైసీపీకి ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ తో కలుపుకుని బలం 15 మంది ఉంటే టీడీపీ జనసేన కలసి పదమూడు మంది ఉన్నారు.

రెండేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులు పొందారు. రొటేషన్ విధానంలో మరో ఇద్దరికి చాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో వారు రాజీనామా చేశారు దాంతో ఈ ఎన్నిక జరగనుంది. టీడీపీ నుంచి ఏ రకమైన ఇబ్బందులు లేకుంటే ఈ ఎన్నిక లాంచనమే అని చెప్పాలి. వైసీపీకి 15 మంది కౌన్సిలర్ల మద్దతుతో పాటు ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు కూడా ఉన్నారు. మెజారిటీ చూస్తే సరిపోతుంది అని అంటున్నారు.

తన సొంత ఇలాకాలో వైసీపీ ప్రశాంతంగా గెలిచేస్తే అయ్యన్న ఎలా తీసుకుంటారో చూడాలి. ఆయన వ్యూహాలు కనుక అమలు చేయాలనుకుంటే అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడి చేయాలని అనుకుంటే మునిసిపాలిటీని టార్గెట్ చేయవచ్చు.

దాంతో అన్ని రకాల జాగ్రత్తలు వైసీపీ తీసుకుంది. టీడీపీ నుంచి పోటీ లేకుంటే ఏకగ్రీవమనే చెప్పాలి. నువ్వా నేనా అంటూ ఢీ కొట్టే నర్శీపట్నం రాజకీయాల్లో మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ లను మళ్ళీ గెలిపించుకోవడం ద్వారా వైసీపీ సత్తా చాటాలని చూస్తోంది.