నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కింది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. సినిమాలో తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని చెబుతున్నాడు నవీన్.
షూటింగ్ స్టార్ట్ అయిన మొదటి 2 రోజులు, కాస్త ఇబ్బంది పడ్డాడట నవీన్. ఆ తర్వాత నుంచి అనుష్క బాగా అలవాటైపోయిందట. షూటింగ్ మొత్తం సరదాగా సాగిపోయిందని చెబుతున్నాడు.
మరి ఈ మొత్తం ప్రాసెస్ లో సీనియర్ నటి అనుష్క నుంచి పొలిశెట్టి నేర్చుకున్న అంశాలేంటి? ఇదే ప్రశ్న ఈ హీరోకు ఎదురైంది. దీనిపై వెంటనే స్పందించాడు నవీన్. అనుష్క నుంచి కౌగిలింతలు నేర్చుకున్నానని చెబుతున్నాడు.
“సెట్స్ లో అడుగుపెట్టగానే ఓ వెచ్చటి హగ్ ఇస్తుంది అనుష్క. ఎంతో అభిమానపూర్వకంగా ఇచ్చే కౌగిలింత అది. ఆవిడ నుంచి నేను కూడా అలా హగ్ ఇవ్వడం నేర్చుకున్నాను. అనుష్కలో ఉన్న మంచి క్వాలిటీస్ లో అదొకటి.”
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రయిలర్ లో అనుష్కను చాలా తక్కువగా చూపించారని, సినిమాలో ఆమె చేసే రచ్చ ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నాడు నవీన్. సినిమా మొత్తం తమ కెమిస్ట్రీ పైనే నడుస్తుందని చెబుతున్న నవీన్.. ఏ నటుడితోనైనా సింక్ అయ్యే లక్షణం, టాలెంట్ అనుష్కలో ఉందని చెబుతున్నాడు.
సెప్టెంబర్ 7న థియేటర్లలోకి వస్తోంది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకుడు. ఈ సినిమా తర్వాత మరే సినిమాకూ కాల్షీట్లు కేటాయించలేదు అనుష్క.