అనుభ‌వం లేని మంత్రులు… టీడీపీకి న‌ష్ట‌మా?

కూట‌మికి అప‌రిమిత‌మైన అధికారం. దీంతో చంద్ర‌బాబునాయుడు ఓ ప్ర‌యోగం చేశారు. అనుభ‌వం లేని, మొద‌టిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ప‌య్యావుల కేశ‌వ్, పార్థ‌సార‌థి, అనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి లాంటి వాళ్లు మిన‌హాయిస్తే…

కూట‌మికి అప‌రిమిత‌మైన అధికారం. దీంతో చంద్ర‌బాబునాయుడు ఓ ప్ర‌యోగం చేశారు. అనుభ‌వం లేని, మొద‌టిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ప‌య్యావుల కేశ‌వ్, పార్థ‌సార‌థి, అనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి లాంటి వాళ్లు మిన‌హాయిస్తే అనుభ‌వ‌జ్ఞులైన మంత్రులెవ‌రూ లేరు. దీంతో రాజ‌కీయంగా టీడీపీకి న‌ష్ట‌మ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

బాబు స‌ర్కార్ 70 రోజుల పాల‌న గ‌మ‌నిస్తే, మంత్రుల అనుభ‌వ రాహిత్యం ప్ర‌భుత్వంపై నెగెటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తోంద‌నే చ‌ర్చ టీడీపీలో అంత‌ర్గ‌తంగా సాగుతోంది. లోకేశ్ భ‌విష్య‌త్ రాజ‌కీయ అవ‌స‌రాల కోసం యువ‌త‌కు అమాత్య ప‌దవులు క‌ట్టబెట్టార‌నే సంగ‌తి తెలిసిందే. నారా లోకేశ్ గ‌తంలో మంత్రిగా ప‌ని చేశారు. చంద్ర‌బాబుకు వ‌య‌సు పైబ‌డుతున్న రీత్యా లోకేశ్‌ను ఆయ‌న వార‌సుడిగా తెర‌పైకి తెచ్చేందుకు సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

అందుకే లోకేశ్ నాయ‌క‌త్వానికి ఎదురు లేకుండా చేసే క్ర‌మంలో యువ నాయ‌కుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అప‌రిమిత‌మైన అధికారం ద‌క్క‌డంతో ప్ర‌యోగాల‌కు స‌రైన స‌మ‌యం ఇప్పుడు కాక‌పోతే మ‌రెప్పుడు అనే ఉద్దేశంతో చంద్ర‌బాబు త‌న స‌హ‌జ ధోర‌ణికి విరుద్ధంగా మంత్రి ప‌ద‌వులు ఇచ్చార‌ని అంటున్నారు. అయితే అడ్మినిస్ట్రేష‌న్‌పై అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో త‌ప్పులు దొర్లుతున్నాయ‌ని, దీని వ‌ల్ల ప్ర‌జ‌ల్లో చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని అంటున్నారు.

ముఖ్యంగా మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై అఘాయిత్యాలు, రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యంలో హోంమంత్రిత్వ శాఖ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని సొంత పార్టీ నేత‌ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లున్నాయి. హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఎంత సేపూ చంద్ర‌బాబు, లోకేశ్ మెప్పు కోసం వైఎస్ జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు ప‌రిమితం అవుతున్నార‌నే అభిప్రాయం వుంది. అలాగే ఇటీవ‌ల అన‌కాప‌ల్లి ఫార్మా కంపెనీలో ప్ర‌మాదం జ‌రిగితే, ఎంత మంది చ‌నిపోయారు? క్ష‌తగాత్రులెంద‌ర‌నే వివ‌రాలు త‌న‌కు తెలియ‌ద‌ని కార్మిక‌శాఖ మంత్రి చెప్ప‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉద‌యించింది.

ఇలాంటివ‌న్నీ ప్ర‌భుత్వ తీరుపై ప్ర‌భావం చూపుతాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అలాగే ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం, పోల‌వ‌రం నిర్మాణంపై సంబంధిత శాఖ‌ల మంత్రుల అభిప్రాయాలు గంద‌ర‌గోళంగా ఉన్నాయ‌ని అంటున్నారు. ఇలాంటివ‌న్నీ మంత్రుల అనుభ‌వ రాహిత్యం వ‌ల్ల జ‌రుగుతున్నాయ‌నే చ‌ర్చ టీడీపీలో ఎక్కువ‌గా జ‌రుగుతోంది. వీటి వ‌ల్ల రాజ‌కీయంగా టీడీపీకి న‌ష్టం వాటిల్లుతోంద‌ని అంటున్నారు.

18 Replies to “అనుభ‌వం లేని మంత్రులు… టీడీపీకి న‌ష్ట‌మా?”

  1. As per my opinion anubhavam ki pedda importance undadu…….mantri ga unnanduku atleast oka 40% of their intentions janalaku Edo oka manchi cheyyalani unte chalu vallu the best avutaru….40% endukante 100% undalanukunna kuda ee system lo vallu survive avvaleru so 60% exemption 😃

  2. As per my opinion manchi cheyyataniki Anubhavam ki pedda importance undadu Edina scam chesi Ela bayatapadalo teliyataniki anubhavam and contacts kavali….mantri ga unnanduku valla intentions lo atleast 40% janalaki Edo oka manchi cheyyalani unte chalu vallu the best avutaru…….okavela 100% undalanukunna kuda ee system lo survive avvaleru anduke 60% exemption 😃

  3. దోచుకోవడం లో అనుభవం వున్న వాళ్ళకి minister posts ఇచ్చిన మన అన్నయ్య గురించి కూడా కొంచెం చెప్పు GA….

  4. లంగా leven గాడు భూతులు మాట్లాడడమే అర్హత గా మంత్రి పదవులు ఇచ్చాడు.. ఆ బూతు మంత్రులు ఒక్కసారి అయినా వాళ్ళ శాఖలో డెవలప్మెంట్ గురించి ప్రెస్ మీట్ పెట్టి వివరించారా?? లేక చంద్రబాబునీ, PK నీ, లోకేష్ నీ తిట్టడానికే ప్రెస్మీట్ పెట్టేవారా??

    ఇప్పుడు ఫస్ట్ టైం mla & మంత్రులు, సబ్జెక్టు మాట్లాడుతూ కొన్ని పొరపాట్లు చేస్తే ఏదో తాడేపల్లి ప్యాలెస్ బద్ధలు అయినట్టు ఫీల్ అవుతున్నావ్ కదరా వెంకులు..

  5. ల0గా leven గాడు భూతులు మాట్లాడడమే అర్హత గా మంత్రి పదవులు ఇచ్చాడు.. ఆ బూతు మంత్రులు ఒక్కసారి అయినా వాళ్ళ శాఖలో డెవలప్మెంట్ గురించి ప్రెస్ మీట్ పెట్టి వివరించారా?? లేక చంద్రబాబునీ, PK నీ, లోకేష్ నీ తిట్టడానికే ప్రెస్మీట్ పెట్టేవారా??

    ఇప్పుడు ఫస్ట్ టైం mla & మంత్రులు, సబ్జెక్టు మాట్లాడుతూ కొన్ని పొరపాట్లు చేస్తే ఏదో తాడేపల్లి ప్యాలెస్ బద్ధలు అయినట్టు ఫీల్ అవుతున్నావ్ కదరా వెంకులు..

  6. ల0గా leven గాడు ‘భూతులు మాట్లాడడమే అర్హత గా మంత్రి పదవులు ఇచ్చాడు.. ఆ బూ’తు మంత్రులు ఒక్కసారి అయినా వాళ్ళ శాఖలో డెవలప్మెంట్ గురించి ప్రెస్ మీట్ పెట్టి వివరించారా?? లేక చంద్రబాబునీ, PKనీ, లోకేష్ నీ లే’కి భాషలో తిట్టడానికే ప్రెస్మీట్ పెట్టేవారా??

    ఇప్పుడు ఫస్ట్ టైం mla & మంత్రులు, సబ్జెక్టు మాట్లాడుతూ కొన్ని పొరపాట్లు చేస్తే ఏదో తాడేపల్లి ప్యాలెస్ బద్ధలు అయినట్టు ఫీల్ అవుతున్నావ్ కదరా వెంకులు..

  7. వినే వాడు వెధవ ఐతే పంది కూడా పురాణం చెబుతుంది అట. అలా ఉంది మన ఎవ్వారం. కానివ్వు కానివ్వు.

  8. ఓయమ్మ… మా హోం మినిస్టర్ అత్యంత సమర్దంగా పని చేస్తున్స వాషయం మాకంటే మీకే బాగా తెలుసు కాని, నీ మాజీ ముక్కేమంత్రి జగ్గప్ప సంగతేంది మరి ? భారతదేశ రాజకీయ చరిత్రలో మీ జగ్గప్పలా అత్యంత దారుణంగా విఫలమైన చెత్త, రోత, అవినీతి, అసమర్థ ముక్కేమంత్రి ఇంకెవడన్నా ఉన్నడేమో చెప్పు..

Comments are closed.