అన్నీ ఓకే.. కానీ బోర్డులు మాత్రం వేయరు!

సమీక్ష సమావేశంలో ఇన్ని నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబుకు.. ఆలయాలకు పాలక మండలులను ఏర్పాటు చేయడం కూడా తమ బాధ్యత అనే సంగతి తెలియదా?

దేవాదాయ శాఖ మీద మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ గురించి అనేకానేక విలువైన సూచనలు చేశారు. నిర్ణయాలు తీసుకున్నారు. అనేక మంచి పనులను కూడా అమలులోకి తేవాల్సిందిగా ఆదేశించారు. ఖాళీగా ఉన్న అధికార్ల పోస్టులను భర్తీ చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి గానీ.. ఆలయ పాలకమండలుల ఏర్పాటు గురించి మాత్రం ఎలాంటి నిర్ణయమూ రాలేదు.

రాష్ట్రంలో ఉన్న వందకకుపైగా ప్రధాన ఆలయాల ధర్మకర్తలా మండలులలో చోటు దక్కుతుందని కూటమి పార్టీల నాయకులు కోటి ఆశలతో ఏడాదిగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రతిసారీ చంద్రబాబునాయుడు ఇదిగో అదిగో అంటూ రోజులు నెట్టేస్తున్నారు. ఏడాది పూర్తయిపోతోంది. అయినా వారి మొరను చంద్రబాబు ఆలకించడం లేదు. ఈ వైఖరిపై పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన నిరుత్సాహం ఏర్పడుతోంది.

దేవాదాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా 15 కీలక ఆలయాలలో ప్రతిరోజూ భక్తులకు అన్నప్రసాద వితరణ ఉండాలని చంద్రబాబునాయుడు సూచించారు. తిరుమల తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రం తరహాలో అత్యున్నత ప్రమాణాలు పాటించేలా.. భక్తులందరికీ ఉచిత భోజన వసతి కల్పించేలా త్వరలో ఏర్పాట్లు జరగాలని ఆదేశించారు. ఇలాంటివి రాష్ట్రంలో టెంపుల్ టూరిజాన్ని పెంచుతాయని చంద్రబాబు సూచించారు.

అలాగే దేవాలయాల భూములను వాణిజ్య సంస్థలకు లీజుకు కేటాయించే సందర్భాల్లో అనుసరించాల్సిన విధివిధానాల గురించి సమగ్ర ప్రతిపాదనలు తయారు కావాలని కూడా ఆయన సూచించారు. ఆలయాలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.

రాష్ట్రంలో కొత్తగా 24,538 ఆలయాలలో కూడా సీసీటీవీల వ్యవస్థలు ఏర్పాటు కావాలని చంద్రబాబు సూచించారు. అలాగే ఆలయాల్లో అధికారులు సిబ్బంది పరంగా ఉన్న దాదాపు 137 ఖాళీలను, వైదిక సిబ్బంది పరంగా ఉన్న 200 పోస్టులను కూడా త్వరలోనే భర్తీచేయాలని కూడా చంద్రబాబు సూచించారు.

సమీక్ష సమావేశంలో ఇన్ని నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబుకు.. ఆలయాలకు పాలక మండలులను ఏర్పాటు చేయడం కూడా తమ బాధ్యత అనే సంగతి తెలియదా? అనే వేదన ఇప్పుడు కూటమి పార్టీల నాయకుల్లో కనిపిస్తోంది. ఎమ్మెల్యే పదవుల తర్వాత.. పార్టీ విజయం కోసం ఎన్నికల్లో కష్టపడి పనిచేసే ద్వితీయ శ్రేణి నాయకులు ఆశించే పదవుల్లో ఆలయాల ట్రస్టు బోర్డులు కీలకమైనవి. అయితే ఏడాదిగా తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలిని తప్ప.. మరో ఆలయానికి చంద్రబాబు బోర్డు ఏర్పాటు చేయనేలేదు.

ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు సకాలంలో ఇవ్వడం లేదని, అందుకే జాప్యం జరుగుతున్నదని ఆయన కొన్ని నెలల కిందట ప్రకటించారు. కానీ.. వాస్తవంలో అధినేత నిర్ణయం తీసుకోవడంలోనే ఈ జాప్యం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.

4 Replies to “అన్నీ ఓకే.. కానీ బోర్డులు మాత్రం వేయరు!”

  1. ఆధ్యాత్మిక దేవాలయాల పాలన  కి, 

    అధికార రాజకీయ పార్టీల కి అది ఎవరైనా కానీ లింక్ తీసెయ్యాలి. 

    గతం లో చూసారు, హిందూ మతం అంటే గిట్టని వాలు కూడా హిందూ దేవాలయాల పాలన బోర్డు లో చేరి నాశనము చేసారు. 

    హిందువులు ఈ విషయంలో మేల్కొని , కేవలం హిందూ ఆధ్యాత్మిక విషయాల్లో నమ్మకం ఉన్న వారితో అధికారం రాజకీయ పార్టీ తో లింక్ లేకుండా, ఏ పార్టీ వారైనా సరే, కేవలం హిందూ మతం లో నమ్మకం ఉన్న వారితోనే బోర్డును ఏర్పాటు చేసుకోవాలి.

  2. హిందూ మతం ప్రస్తుతం అన్నివైపుల నుండి 

    మిగతా మతాల వారి మత మార్పిడి దాడులతో గురి అవుతుంది. 

    ఈ సమయంలో హిందూ సమాజంలో ఆ దాడులను గట్టిగా తిప్పి కొట్టే దమ్ము వున్న వారితో హిందూ ఆలయాల పాలన బోర్డు లని ఏర్పాటు చేసుకోవాలి.

    1)వేరే మతాల దాడులను గట్టిగా తిప్పికొట్టడం,

    2)తాత్కాలిక ప్రలోభాలకు లోనయి వేరే మత్దం లోకి మారిన వారికి , తిరిగి హిందూ మతంలో లోకి తీసుకు రావడానికి ప్రతి ఆలయం తరపు ఒక టీం ఏర్పాటు చేయడం,

    3)హిందూ యువతీ యువకులు లో ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెంచేలా ప్రయత్నాలు చేయడం

    ఇవన్నీ చేయడానికి వెన్ను దన్నుగా ఉండే వారితోనే పాలన బోర్డు ఏర్పాటు చేసుకోవాలి.

    ఇది హిందువు లకి ఆత్మ రక్షణ సమయం. పోరాడాలి సైనా సమయం.

     ఏమరుపాటుగా ఉంటే దేశ సామాజిక  స్వరూపం మీ మారిపోతుంది. కనుక జగురుకతో ఉండండి. ప్రతి ఒక్కరు ఒక్కో బాల్ థాకరే లాగ ఆ లోచన చేయాలి.

Comments are closed.