వైఎస్సార్‌సీపీ ప్లీన‌రీ అక్క‌డే.. ఎన్నిక‌ల శంఖారావం కూడా!

అధికారం కోల్పోయిన త‌ర్వాత మొద‌టి ప్లీన‌రీని ఆ ప్రాంతం నుంచే మొద‌లు పెట్ట‌డం ద్వారా, రాజ‌కీయ క‌ద‌లిక‌కు బీజం వేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు.

వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయంగా వేగం పెంచుతున్నారు. కూట‌మి పాల‌న ఏడాది పూర్తి కావ‌స్తుండ‌డం, మ‌రోవైపు ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వుంద‌ని న‌మ్ముతుండ‌డంతో వైఎస్ జ‌గ‌న్ ఊపు మీద ఉన్నారు. వ‌చ్చే ఏడాది జూలై 8న వైఎస్సార్ జ‌యంతి పుర‌స్క‌రించుకుని వైఎస్సార్‌సీపీ ప్లీన‌రీ ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని వైఎస్‌ జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఈ మేర‌కు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం విశేషం.

ఒక ర‌కంగా పార్టీ ప్లీన‌రీని ఎన్నిక‌ల శంఖారావంగా జ‌గ‌న్ భావిస్తున్నారు. అందుకే ఘ‌నంగా నిర్వ‌హించి, త‌న పార్టీ మ‌ళ్లీ పుంజుకుంద‌నే సంకేతాల్ని జ‌నంలోకి పంపాల‌ని ఆయ‌న అనుకుంటున్నారు. ఈ ద‌ఫా వైఎస్సార్‌సీపీ ప్లీన‌రీని ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన‌ట్టు పార్టీ విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డం ద్వారా, అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవ‌చ్చ‌ని జ‌గ‌న్ ఎత్తుగ‌డ‌.

ఎంతో ముందుగానే వైఎస్సార్‌సీపీ రాజ‌కీయ ఎజెండా, అలాగే పాద‌యాత్ర గురించి ప్లీన‌రీలో ప్ర‌క‌టించ‌నున్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కూట‌మి నేత‌ల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో విభేదాలున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. కూట‌మిలో లుక‌లుక‌ల్ని రాజ‌కీయంగా సొమ్ము చేసుకోవాల‌నే ఎత్తుగ‌డ‌తో జ‌గ‌న్ జాగ్ర‌త్త‌గా అడుగులు వేయ‌నున్నారు.

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి. కేవ‌లం పిఠాపురం త‌ప్ప‌, మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్ని క‌నీసం అధికార ప‌క్షంగా టీడీపీ గుర్తించ‌డం లేదు. నిజానికి జ‌న‌సేన బ‌లంగా ఉండేది ఆ జిల్లాల్లోనే. ప‌వ‌న్‌క‌ల్యాణ్ సామాజిక వ‌ర్గం ఆ జిల్లాల్లో గెలుపోట‌ముల‌ను నిర్ణ‌యించే ప‌రిస్థితిలో వుంది. కానీ అధికారంలో భాగంగా ఉన్న‌ప్ప‌టికీ, జ‌న‌సేన ప‌నులేవీ జ‌ర‌గ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం ఇవేవీ త‌న‌కు ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఎక్క‌డైతే వైఎస్సార్‌సీపీ బ‌లహీనంగా వుందో, అక్క‌డి నుంచే దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని జ‌గ‌న్ ఆలోచ‌న‌. అందుకే ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌పై జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి సారించారు. అధికారం కోల్పోయిన త‌ర్వాత మొద‌టి ప్లీన‌రీని ఆ ప్రాంతం నుంచే మొద‌లు పెట్ట‌డం ద్వారా, రాజ‌కీయ క‌ద‌లిక‌కు బీజం వేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు.

17 Replies to “వైఎస్సార్‌సీపీ ప్లీన‌రీ అక్క‌డే.. ఎన్నిక‌ల శంఖారావం కూడా!”

  1. శంఖారావం అనేది హిందువుల వాడే మాట.

    ఆంద్ర మొత్తం నీ వాటికన్  మతం లోకి మార్చాలి అనే వాటికన్ వాళ్ళ లాజరస్ ప్రాజెక్టు లోకల్ గా నడిపిస్తున్న మన ప్యాలెస్ పులకేశి అన్నయ్య కరుడు కట్టిన క్రైస్తవుడు కాబట్టి ఎన్నికల సువార్త అని చెప్పాలి కదా గ్రేట్ ఆంద్ర. 

  2. ఉభయ గోదావరి జిల్లాల్లో గొర్రె బిడ్డలు ఎక్కవ.

     ప్రతి సందుకి ఒక చర్చ్ ఉంది.

     ప్రతి పాస్టర్ కూడా ఫ్యాన్ పార్టీ కి దశమ భాగాల్లో ప్యాలెస్ కి నెల నెల వాటాలు పంపే ఏజెంట్లు. అందుకే అక్కడ పెడుతున్నాడు .. అన్న చాలా స్మార్ట్.

    1. మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాకు కాకినాడ జిల్లా లో రాజమండ్రి జిల్లాలో కూడా వ్యవసాయ భూములు వున్నాయి మా దగ్గర కి అనేక మంది వ్యవసాయ కూలీలు పని రీత్యా వస్తారు వాళ్లలో అనేకమంది క్రిస్టియన్స్ వున్నారు మీరన్నట్టు జగన్ గారికి అయితే వెయ్యరు కూటమి కి వెయ్యటం ఇష్టం లేకపోతే వేరే పార్టీ లకు వేస్తారు వైసీపీ కి మాత్రం వెయ్యరు అది కాక ఇక్కడ కూటమి కి వ్యతిరేకత లేదు

  3.  ys వివేక ను చంపించి, ys విజయమ్మ ను పార్టీ పదవి లో నుండి తీసేసిన వాళ్ళని , 

    Ys రాజశేఖర్ రెడ్డి అభిమానులు తగిన శాస్తి చేయాలి.

    1. ఇక్కడ కాదు కానీ మీ అమూల్య మైన కా మెంట్స్ కింద ఆర్టికల్ లో రాయొచ్చు కదా.

      హ‌వ్వా.. టీటీడీ స్థ‌లం ముంతాజ్‌కు కేటాయింపు! 

  4. అధికారం లో ఉన్నప్పుడు పెట్టిన ప్లీనరీ ఎన్నికల శంఖారావం తరువాత వచ్చింది 11. అంటే ఇప్పుడు గోదావరి జిల్లాలో కాకుండా మిగితా అంతా పార్టీ బలేస్తంగా ఉందన్నమాట

  5. అక్కడెక్కడో బలహీనంగా ఉండటం ఏంట్రా అయ్య, వాడి కొంపతో సహా రాష్ట్రం మొత్తం అలాగే ఉంటేను…

  6. నాలుగేళ్లు ముందే ఎన్నికల శంకరవమా .. ఇదేందీ .. నవ్వాలా ఏడవాలా ..

  7. Sidhama annaru paduko pettaru…4 years tarwata election ki evadina ippue sankaram chestada? malli baga vongopettuttu vunnaru simhanni

  8. ప్లీనరీ ఎంత ఘనంగా చేసిన ,ఎక్కడ చేసిన , ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా, వచ్చే ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెరగవచ్చేమో కాని, ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరగదు. .. ఇంకో విషయం గుట్కా గాఁడు గాడు బీజేపీ లో చేరుతున్నాడు !

Comments are closed.