బాబు కోసం మ‌ర‌ణాలు.. ఇక ప‌రామ‌ర్శ లేన‌ట్టా?

తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు జైలు పాలు కావ‌డాన్ని త‌ట్టుకోలేక సుమారు 150 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్టుగా ప‌చ్చ‌మీడియా, ప‌చ్చ పార్టీ ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించింది! చంద్ర‌బాబు జ‌స్ట్ 50…

తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు జైలు పాలు కావ‌డాన్ని త‌ట్టుకోలేక సుమారు 150 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్టుగా ప‌చ్చ‌మీడియా, ప‌చ్చ పార్టీ ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించింది! చంద్ర‌బాబు జ‌స్ట్ 50 రోజుల్లో జైలు నుంచి బ‌య‌టొచ్చి.. బిందాస్ గా త‌న అనారోగ్య చికిత్స చేయించుకుంటున్నారు! ఈ మాత్రం దానికి, ఆయ‌న బ‌య‌ట‌కు వ‌స్తార‌నే న‌మ్మ‌కం లేక ఏకంగా 150 మంది మ‌ర‌ణించార‌ని ప‌చ్చ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి!

మ‌రి అలా చంద్ర‌బాబు కోసం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకుల‌ను ఆయ‌న భార్య నారా భువ‌నేశ్వ‌రి ప‌రామ‌ర్శించే యాత్ర కూడా ఒక‌టి మొద‌లుపెట్టారు. అలా ప‌రామ‌ర్శించ‌డంతో పాటు ఒక్కో కుటుంబానికి కొంత ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తున్నార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. మ‌రి అందులో నిజానిజాల మాటేమిటో కానీ… ఇప్పుడు ఆ యాత్ర అర్ధాంత‌రంగా ఆగిపోయింది.

చంద్ర‌బాబుకు బెయిల్ రావ‌డం, ఆయ‌న చికిత్స చేయించుకుంటూ ఉండ‌టం, నారా భువ‌నేశ్వ‌రి తిరిగి గృహిణిగా, హెరిటేజ్ కార్య‌క్ర‌మాల్లో బిజీ కావ‌డం జ‌రిగిపోయిన‌ట్టుగా ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో.. ఇంతకీ ఆ 150లో కుటుంబాల ప‌రామ‌ర్శ గాలికిపోయిన‌ట్టుగా ఉంది!

చంద్ర‌బాబు కోసం వారి ప్రాణాలు పోయాయ‌న్నారు, ప‌రామ‌ర్శ అన్నారు. బాబుకు బెయిల్ రాగానే.. ఇప్పుడు ఆ వ్య‌వ‌హారం వార్త‌ల్లో లేకుండా పోయింది. మ‌రి ఇంత‌కీ ఆ పరామ‌ర్శ, ఆర్థిక సాయం ఇక గాలికిపోయిన‌ట్టేనా అనే సందేహాలు కూడా రావొచ్చు!

గ‌తంలో తుఫాన్ బాధితుల‌కు అంటూ ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ నుంచి వాహ‌నాల‌ను బ‌య‌ట‌కు పంపి, వాటిని హైదరాబాద్ లో కాసేపు అటూ ఇటూ తిప్పి, తిరిగి దొడ్డిదారిన ఎన్టీఆర్ భ‌వ‌న్ లోకి తీసుకొచ్చిన ఘ‌న చ‌రిత్ర తెలుగుదేశం పార్టీ సొంతం. ఏదైనా షో చేయ‌డం వర‌కే తెలుగుదేశం పార్టీ చేస్తుంది. మ‌రి ఇప్పుడు చంద్ర‌బాబు జైలు పాల‌వ్వ‌డాన్ని త‌ట్టుకోలేక‌, ఆయ‌న ఇక జైలు నుంచి బ‌య‌ట‌కు రారేమో అనే బెంగ‌తో 150 మంది మ‌ర‌ణించార‌ని చెప్పి, ఇప్పుడు ఆ ప‌రామ‌ర్శ యాత్ర‌కు కూడా బ్రేక్ వేయ‌డం టీడీపీకే చెల్లిన‌ట్టుగా ఉంది!