వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదు. మొత్తం అసెంబ్లీ సీట్లలో కనీసం పది శాతం సీట్లను దక్కించుకుంటేనే ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించారు. ఈ లెక్క ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు లేవు. ప్రస్తుతానికి వైసీపీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరుస్తోంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 18 సీట్లు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా వుంటుంది.
దీంతో ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడని కూడా జగన్ పిలిపించుకునే పరిస్థితి లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా జనసేనకు దక్కుతుంది. ఎందుకంటే ఆ పార్టీ ప్రస్తుతం 20 అసెంబ్లీ స్థానాల్లో ముందంజలో వుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.
అధికార, ప్రతిపక్ష హోదా …రెండూ కూటమిలోని పార్టీలకే దక్కడం విశేషం. అసెంబ్లీలో అధికార పక్షానికి వ్యతిరేకమైన వైసీపీ బలం చాలా తక్కువ. దీంతో అసెంబ్లీలో ఆ పార్టీ నేతలకు మాట్లాడేందుకు అవకాశాలు ఏ మాత్రం వుంటాయో అంచనా వేసుకోవచ్చు.
బహుశా ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని దయనీయ స్థితికి దిగజారుతామని వైసీపీ నేతలు ఊహించి వుండరు. ఈ దారుణ పరిస్థితికి కారణాలను వైసీపీ ఏం చెబుతుందో చూడాలి.