టీడీపీ అధికారంలోకి వస్తే గుడివాడలో కొడాలి నానిని కట్ డ్రాయర్‌పై నిలబెడ్తామని యువ నాయకుడు నారా లోకేశ్ హెచ్చరించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గంపై చంద్రబాబునాయుడు సమీక్షించారు. అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. గుడివాడలో నానిని ఓడించేందుకు సరైన అభ్యర్థి కోసం చంద్రబాబు తీవ్రంగా వెతుకుతున్నారు. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ, ఏదో ఒక కొరత కనిపిస్తోంది.
నిన్నగాక మొన్న గన్నవరంలో కూడా టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్ పేరు ఖరారు చేశారు. అది కూడా వైసీపీ నుంచి వెళ్తిన నాయకుడే దిక్కయ్యారని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. కానీ గుడివాడలో మాత్రం టీడీపీకి చికాకు తప్పడం లేదు. కనీసం గుడివాడలో కొడాలిపై నిలిపేందుకు సరైన అభ్యర్థి లేరని, కానీ ఆయన్ను కట్ డ్రాయర్‌పై నిలబెడ్తానని లోకేశ్ వార్నింగ్ ఇవ్వడం విచిత్రంగా వుందంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి.
గుడివాడలో టీడీపీకి సరైన అభ్యర్థి లేని దుస్థితి చూస్తుంటే జాలేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయ్యా లోకేశ్ గుడివాడలో కొడాలిని కట్ డ్రాయర్‌పై నిలబెట్టడం తర్వాత చూసుకుందువు, ముందు అభ్యర్థిని నిలబెట్టి చూపించు అని హితవు చెబుతున్నారు.
లోకల్‌గా కొడాలిని ఓడించే నాయకులు లేకపోవడంతో ఎన్ఆర్ఐలను తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడిందని చురకలు అంటిస్తున్నారు. లోకేశ్ కట్డ్రాయర్పై కామెంట్స్‌కు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల నుంచి వస్తున్న రియాక్షన్ ఇది.