ఒకటి రెండు సినిమాలు హిట్ అయితే చాలు నిర్మాతలు.. బయ్యర్ల మూడ్ మారిపోతోంది. కొనడానికి వీళ్లు ఎగబడుతున్నారు. రేట్లు వాళ్లు పెంచుకున్నారు. కానీ తీరా సినిమా విడుదల దగ్గరకు వచ్చే సరికి తేడా వచ్చి బయ్యర్లు వెనుకడుగు వేస్తున్నారు. దాంతో లాస్ట్ మినిట్లో తక్కువ కట్టడం లేదా రేట్లు తగ్గించడం చేయాల్సి వస్తోంది.
రాబోయే వీర ఊర మాస్ సినిమాకు ఓవర్ సీస్ అయిదు కోట్లు కావాలని కూర్చున్నారు. కానీ ఆ డైరక్టర్ సినిమాలకు ఓవర్ సీస్ లో ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు ఓన్ రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ పరిస్థితి చూసి ఓవర్ సీస్ బయ్యర్లు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. రెండు కోట్లకు ఇచ్చినా ఆ సినిమా ఎందుకు అన్నాడో ఓవర్ సీస్ బయ్యర్.
ఇదే సినిమా ఆంధ్ర 30 కోట్ల రేషియో చెప్పారు. కానీ చాలా ఏరియాలకు పెద్దగా ఆసక్తి కనిపించ లేదు. దాంతో 25 కోట్లకు తగ్గించినట్లు ఫీలర్లు వినిపిస్తున్నాయి.
మరో సినిమా వుంది. అది ఆరంభంలో భారీ భారీ రేట్లు చెప్పారు. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. దాంతో రేట్లు తగ్గిస్తున్నారు. ఉత్తరాంధ్రకు 30 కోట్లు చెప్పారు. దాన్ని ఇప్పుడు 20 కోట్లు చెబుతున్నారని తెలుస్తోంది.
కొన్ని సినిమాల సీన్ వేరుగా వుంది. ముందుగా భారీ రేట్లను బయ్యర్లే పెడుతున్నారు. నిర్మాతలు హ్యాపీ అనుకుంటే విడుదల దగ్గర చేసి బయ్యర్లు చేతులు ఎత్తుతున్నారు. ఆ మధ్య విడుదలైన ఓ సినిమాకు ఉత్తరాంధ్ర-గుంటూరు కలిసి మూడు కోట్లు కట్టాల్సింది. కోటి ముఫై లక్షలు కట్టడం గగమనమైంది.
విడుదల కాబోయే ఓ పీరియాడిక్ సినిమాకు ఓవర్ సీస్ అయిదు కోట్లు చెప్పడం మొదలుపెట్టారు. కొనేవాళ్లు ముందుకు రాకపోవడంతో మూడున్నర కోట్లకు వచ్చారు. కానీ ఇంకా ఎవరూ ముందుకు రాలేదు. ఏమవుతుందో చూడాలి.
రెగ్యులర్ బయ్యర్ సెటప్ వున్నవాళ్లు, చేతిలో వరుసగా సినిమాలు వున్న వాళ్లు అయితే అమ్మకాలు, కొనడం సమస్య కావడం లేదు. ఒకటి.. ఒకటి అర చేతిలో వుంటే పెద్ద సినిమాలు అయితే మాత్రం సమస్య అవుతోంది. ఇదో చిత్రమైన పరిస్థితి.