పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ఓజి. ఫ్యాన్స్ కు ఈ సినిమా మీద మామూలు ఆశలు అంచనాలు లేవు. ఓ లెవెల్ లో వున్నాయి. వాటిని నిలబెడతూ గ్లింప్స్ విడుదలైంది. దర్శకుడు సుజిత్ సాహు సినిమా తరువాత ఏళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది.
హీరో పవన్ ను భయంకరమైన గ్యాంగ్ స్టర్ గా పరిచయం చేస్తూ టీజర్ వదిలారు. భయంకరమైన తుపానును మించిన, బ్లడ్ బాత్ ను కనివినీ ఎరుగని విధంగా చూపించిన గ్యాంగ్ స్టర్ మళ్లీ మరోసారి తిరిగి వస్తే…అన్నది స్టోరీ కాన్సెప్ట్ గా కట్ షాట్స్, డైలాగ్స్ రూపంలో గ్లింప్స్ లో చూపించేసాడు దర్శకుడు
పవన్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ గ్లింప్స్ ఆకలి తీర్చేస్తుంది. సినిమా మీద మరింత ఆశలు పెంచేస్తుంది. కెేజిఎఫ్, విక్రమ్, జైలర్, ఇలాంటి సినిమాలు చూస్తే గెంతులు వేస్తున్న మన ఆడియన్స్ మన హీరోతో అలాంటి సినిమా అంటే ఇంక ఏం కావాలి. పవన్ ను మరీ ఎక్కువ చూపించ లేదు. జస్ట్ అలా అలా చూపించారు. మిగిలినవన్నీ రకరకాల షాట్ లే.
బిజిఎమ్ తో థమన్ తరువాత రేంజ్ కు తీసుకెళ్లాడు.కానీ ఆ బిజిఎమ్ లో విక్రమ్ లో అనిరుధ్ చేసిన మ్యూజిక్ ఛాయలు వినిపించాయి. కానీ మొత్తం మీద టీజర్ కు న్యాయం చేసాడు. పవన్ ను అలాంటి ఫిరొషియస్ రోల్ లో తెరమీద చూస్తే ఎలా వుంటాయి ఫ్యాన్స్ కేరింతలు అన్నది ఇమేజ్ చేసుకోవాల్సిందే.