సిటీ ఆఫ్ డెస్టినీకి ఇక కొత్త పేరు

విశాఖ విభజన ఏపీలో మెగాసిటీ. ఆర్ధిక రాజధానిగా ఉంది. వైసీపీ ప్రభుత్వం పాలనా రాజధానిగా విశాఖను చేస్తామని ప్రతిపాదించింది. ప్రస్తుతం అది న్యాయ పరిశీలనలో ఉంది. విశాఖ పారిశ్రామిక కేంద్రంగా ఐటీ హబ్ గా…

విశాఖ విభజన ఏపీలో మెగాసిటీ. ఆర్ధిక రాజధానిగా ఉంది. వైసీపీ ప్రభుత్వం పాలనా రాజధానిగా విశాఖను చేస్తామని ప్రతిపాదించింది. ప్రస్తుతం అది న్యాయ పరిశీలనలో ఉంది. విశాఖ పారిశ్రామిక కేంద్రంగా ఐటీ హబ్ గా ఉంది. టూరిజం డెస్టినీగా ఉంది.

ఇంకో వైపు ఇప్పటికి వంద ఏళ్ల క్రితం స్థాపించిన ఆంధ్రా యూనివర్శిటీతో మొదలుపెట్టి ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలలతో విద్యలకు నిలయంగా ఉంది. అలాంటి విశాఖను విద్యా రాజధానిగా చేసేందుకు ఒక పెద్ద ప్రయత్నమే సాగుతోంది.

వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి విశాఖలో వరల్డ్ క్లాస్ యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచంలో టాప్ ఫిఫ్టీగా ఉన్న వర్శిటీలలో ఒకటిగా ఈ యూనివర్శిటీని నెలకొల్పబోతున్నారు

ఈ వర్శిటీ ఏర్పాటు కోసం చురుకుగా కసరత్తు సాగుతోంది. రెండు వందల ఎకరాల సువిశాల స్థలంలో ఈ వర్శిటీ ఏర్పాటు చేయనుండడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ వర్శిటీ ఏర్పాటుతో అంతర్జాతీయ నైపుణ్యం కలిగిన మానవ వరనులు విశాఖ నుంచే తయారవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రస్తుతం దేశం నుంచి అత్యుత్తమ విద్య కోసం ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఆ పరిస్థితి భవిష్యత్తులో రాకుండా చూసేందుకు విశాఖ కేంద్రంగా బృహత్తర ప్రయత్నమే చేయబోతున్నారు. కేవలం వర్శిటీ మాత్రమే కాకుండా క్రీడల విభాగం అభివృద్ధి కోసం ప్రత్యేక ఏర్పాటు కూడా చేయనున్నారు. అతి పెద్ద అంతర్జాతీయ విశ్వవిద్యాలయం రాకతో విశాఖలో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడడమే కాకుండా ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు దక్కుతాయని అంటున్నారు.

విశాఖకు ప్రపంచ స్థాయి వర్శిటీ రాబోతుందన్న వార్తలో మేధావులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ అభివృద్ధి మరింతగా సాగనుంది అని వారు అంటున్నారు. ఉత్తరాంధ్రా సహా ఏపీలోని యువతకు మంచి చదువుతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధికి కూడా ఈ వర్శిటీ పునాది వేస్తుందని అంటున్నారు. ఈ మేరకు సాగుతున్న ప్రయత్నాలు త్వరలోనే కార్యాచరణకు సిద్ధం అవుతాయని అంటున్నారు. విశాఖ కేరాఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అన్నట్లుగా మారబోతోంది. ఇక మీదట సిటీ ఆఫ్ డెస్టినీ కొత్త పేరును సంతరించుకోనుంది అని అంటున్నారు.