బుడమేరు కాదు సార్.. ఇంకా చాలా ఉన్నాయ్!

వెనకటికి ఎవడో.. ఇల్లు తగలబడినప్పుడు, మంటలు ఆర్పడానికి నీళ్లు కావాలి గనుక, బావి తవ్వడం ప్రారంభించాడట. ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న వరద సహాయక, నివారణ, జాగ్రత్త చర్యలు గమనిస్తే అలాంటి వైఖరే మనకు…

వెనకటికి ఎవడో.. ఇల్లు తగలబడినప్పుడు, మంటలు ఆర్పడానికి నీళ్లు కావాలి గనుక, బావి తవ్వడం ప్రారంభించాడట. ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న వరద సహాయక, నివారణ, జాగ్రత్త చర్యలు గమనిస్తే అలాంటి వైఖరే మనకు గుర్తుకు వస్తుంది.

ఎందుకంటే.. బుడమేరు పొంగి విజయవాడను మొత్తం సర్వనాశనం చేసిన తరువాత.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం చాలా ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. పాత ప్రభుత్వం ఇప్పటికీ పరిపాలనలో ఉంటే.. ముంపు ప్రాంతాల్లో జనజీవనం పునరుద్ధరించడానికి ఆరునెలల వ్యవధి పట్టేదని, తాము గనుక తొందరగా చేశామని చంద్రబాబు చెప్పుకున్నారు.

ప్రతి ప్రభుత్వానికి ఆ మాత్రం స్వోత్కర్ష, పరనింద ఉండడం అర్థం చేసుకోవచ్చు. అలాగే సర్కారు ముంపు ప్రాంతాల్లో నష్టపోయిన ప్రజలకు ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఉన్నవారికి ప్రతి ఇంటికి పాతికవేల వంతున, ఆటోలకు పదివేలు, టూవీలర్స్ కు 3 వేలు వంతున ప్రకటించారు . అంతా బాగానే ఉంది. కానీ భవిష్యత్తులో ఇలాంటి ముప్పులు వాటిల్లినా సరే.. జనజీవితం అతలాకుతలం కాకుండా తీసుకోదలచిన ముందు జాగ్రత్తల గురించి చంద్రబాబు చెబుతున్న మాటలే విస్తుగొలుపుతున్నాయి.

ఆపరేషన్ బుడమేరు ప్రారంభిస్తాం అని చంద్రబాబు అంటున్నారు. బుడమేరు ఎగువన రిజర్వాయర్ నిర్మిస్తామని, అందులో నీటిని కృష్ణా నదిలోకి విడిచిపెట్టే మార్గాలు చూస్తామని, ఆక్రమణలు పూర్తిగా తొలగిస్తామని అంటున్నారు. నిజానికి ప్రభుత్వం ఇంకా విశాలంగా, దూరదృష్టితో ఆలోచించాలి. ఇప్పుడు బుడమేరు జనాన్ని ముంచేసింది గనుక.. ఆపరేషన్ బుడమేరు అని చంద్రబాబు అంటున్నారు.

ఇది వాస్తవంలో.. ‘ఆపరేషన్ నీటివనరులు’ అన్నట్టుగా సాగాలి. ఇవాళ వచ్చిన సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకడం మంచిదే. కానీ.. రాష్ట్రంలో ఇంకా ఎక్కడా కూడా ఇలాంటి విపత్తులు అసలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం దార్శనిక ప్రభుత్వాలు చేయాల్సిన పని.

తాను నివాసం ఉంటున్న కరకట్ట లింగమనేని భవనం పోతుంది గనుక.. అక్కడి ఆక్రమణలు తొలగించడానికి చంద్రబాబు ఇష్టపడకపోవచ్చు. కానీ.. రాష్ట్రవ్యాప్తంగా జనజీవితానికి, భద్రతకు ముప్పుగా మారుతున్న నీటివనరుల ఆక్రమణలు అన్నింటినీ పూర్తిగా తొలగిస్తేనే ప్రజలు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోగలరు.

13 Replies to “బుడమేరు కాదు సార్.. ఇంకా చాలా ఉన్నాయ్!”

  1. వీడెవడో appendicitiss operationn కోసం tablee మీద పడుకొని మత్తులోకి వెళ్లే ముందర ఒక్క appendix మాత్రమే కాదు కోయాల్సినవన్నీ కోసేయండి అని చెప్పి మగతలోకి జారుకునే బాపతు అనుకుంటా…

  2. నీటి గురించి నీకేం తెలుసు GA?
    అన్నిట్లో దూరి వెర్రి పప్పం అవుతావ్..మనకి పని ఏంటి
    నంది నీ పంది అని పంది నీ నంది అని చెప్పటం వరకె.. అదీ వాడిపెట్టి సాంకేతిక విషయాలలోకి వెళతావేంటి

  3. మీ వెర్రి బాగులోడికి ఇలా ఎప్పుడైనా చెప్పావా….అసలు వాడిని మొగ్గ కుడిపింది నీ రాతలే కదా…

  4. ఈ GA గాడికి ఒకటి ఆగడు అనుకుంట. మొన్న కృష్ణ నదిలో పడవలు ఇంకా తీయలేదా అని ఒక ఆర్టికల్ వదిలాడు. నిన్న ఒక పడవను తీశారు. ఆ విషయం చచ్చినా రాయడు.

  5. బుధమేరుకు ముంపు కొత్త కాదు..ప్రభుత్వాలు ఇలా హామీలు ఇవ్వడం కొత్త కాదు….ముందు ఆ ఏరు పరివాహక ప్రదేశాన్ని గుర్తించి…ఆ పరిధిలో నిర్మించిన కండ్రిక,పాయకాపురం,రాజీవ్ నగర్,ప్రకాష్ నగర్,వాం బే కాలనీ, సింగ్ నగర్,రామకృష్ణ పురం,దేవినేని నగర్,రాజరాజేశ్వరి పేట,ఆంధ్రప్రభ కాలనీ,ఎఫ్ సీ ఐ కాలనీ,సంతోష్ నగర్,శాంతి నగర్,జక్కంపూడి తదితర నివాసిత ప్రాంతాలను ఖాళీ చేయించడమే పరిష్కారం…

Comments are closed.