టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు బిల్లులు

టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల్ని ఇవ్వ‌డానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అంగీక‌రించారు. మొద‌టి విడ‌త‌లో రూ.259 కోట్లు విడుద‌ల చేయ‌డానికి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో టీడీపీ…

టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల్ని ఇవ్వ‌డానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అంగీక‌రించారు. మొద‌టి విడ‌త‌లో రూ.259 కోట్లు విడుద‌ల చేయ‌డానికి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లో ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయింది. 2014-19 మ‌ధ్య కాలంలో నీరు-చెట్టు పేరుతో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు పెద్ద ఎత్తున ఆర్థికంగా ల‌బ్ధి చేకూర్చేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు.

అయితే చంద్ర‌బాబు అధికారం నుంచి దిగిపోయే కాలం నాటికి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అందులో అవినీతి జ‌రిగిందంటూ విచార‌ణ పేరుతో ఏళ్ల త‌ర‌బ‌డి బిల్లులు ఇవ్వ‌కుండా సాగ‌దీశారు. అలాగ‌ని అవినీతిని తేల్చింది కూడా ఏమీ లేదు. దీంతో నీరు-చెట్టు ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్లు కోర్టును ఆశ్ర‌యించారు.

విచార‌ణ అంశాన్ని కోర్టు దృష్టికి వైసీపీ ప్ర‌భుత్వం తీసుకెళ్ల‌గా, ఎంత కాలం చేస్తారంటూ ప్ర‌శ్నించింది. ఈ నేప‌థ్యంలో కొంద‌రికి వైసీపీ ప్ర‌భుత్వం బిల్లులు మంజూరు చేసింది. కానీ బిల్లులు మంజూరు కాని వాళ్లే ఎక్కువ‌. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీర‌డంతో నీరు-చెట్టు బిల్లుల అంశం తెర‌పైకి వ‌చ్చింది. ఎందుకంటే టీడీపీ హ‌యాంలోనే ఆ ప‌నులు చేయ‌డంతో, బిల్లులు వ‌స్తాయ‌నే న‌మ్మ‌కం కుదిరింది.

టీడీపీ కార్య‌క‌ర్త‌ల న‌మ్మ‌కాన్ని చంద్ర‌బాబు వ‌మ్ము చేయ‌లేదు. ద‌శ‌లవారీగా నీరు-చెట్టు బిల్లుల్ని ఇచ్చేందుకు చంద్ర‌బాబు ఆదేశాలు ఇచ్చారు. త‌మ‌కు ఎంతెంత మొత్తం వ‌స్తుందో అనే విష‌య‌మై టీడీపీ కాంట్రాక్ట‌ర్లు లెక్క‌లేస్తున్నారు. ఇందులో అధికారుల‌కు, నాయ‌కుల‌కు ఇవ్వాల్సి రావ‌డంతో కొంత మంది నొచ్చుకుంటున్నారు.

6 Replies to “టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు బిల్లులు”

  1. ఎడిచినట్టె ఉంది నీ హేడ్డింగ్! మన ప్స్య్కొ 5 ఎల్లు కావలని అప్పెతె, చివరికి కొర్తు ఇవ్వమని చెమిప్తె ఇస్తున్నడు అంటున్నావ్! మరి హెడ్డింగ్ ఎలా పెట్టలి?

  2. ప్రియమైన లోకనాథరావు గారికి,

    మీరు కులం గురించే ఎప్పుడూ మాట్లాడటం మానేసి, కాస్త ఆలోచించండి. మీరు కొన్ని వ్యక్తులతో చేదు అనుభవం పొందినట్లుంది, దాంతో మీరు మరీ అంత ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. మీ మనసు ఇంత ద్వేషంతో నిండి ఉందని మీరు అనుకుంటున్నారా? దీని వల్లే మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీ తాజా ఆరోగ్య సమస్యలు మీ లోపల పెంచుకున్న ఈ ద్వేషం కారణంగానే అని నేను అనుకుంటున్నాను.

    మనకు మనం ఇష్టపడే పార్టీని మద్దతు ఇవ్వడానికి హక్కు ఉంది, కానీ మీరు, రంగనాథ్, ఇంకా మరికొందరు ఎప్పుడూ కమ్మ, కాపు సమూహాల మీద ద్వేషం చాటుతున్నారు. మీ ఈ వ్యూహం పబ్లిక్‌కి తెలుస్తోంది. మీరు ఈ రెండు సమూహాల మీద ద్వేషం పెంచి, మీ పార్టీకి ఎక్కువ మద్దతు రాబడతారనుకుని చేసిందే మీ విఫలం. ప్రజలు చాలా తెలివిగా ఆలోచించి, మీ పార్టీకి 175 సీట్లలో కేవలం 11 సీట్లే ఇచ్చారు. మీలా వారు చేసిన ద్వేష ప్రచారం వల్లే మీ పార్టీ ఓడిపోయింది.

    ప్రతి కులంలో మంచివారు, చెడ్డవారు ఉంటారు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఒక ప్రాచీన, గౌరవనీయమైన పురోహిత కుటుంబం నుంచి వచ్చిన వారు, కానీ మీరు, రంగనాథ్ ఎప్పుడూ ఈ రెండు కులాలపై ద్వేషం పెంచుతున్నారు. ద్వేషం మనసుని మాత్రమే కాకుండా శరీరాన్నీ హానికరంగా ప్రభావితం చేస్తుంది. జీవితం చాలా చిన్నది.

    మీరు ఇంత అసభ్యంగా, ద్వేషంతో నిండిన వ్యక్తిగా ఎందుకు మారిపోతున్నారు? ఇతరులపై, ముఖ్యంగా తల్లులపై చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే మీకు సిగ్గు వేయదా? దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలి, ఈ ఆలోచనల నుంచి బయట పడాలి. ఈ వ్యర్థం మానేసి, జీవితం లో మంచి దృక్పథంతో ముందుకు సాగండి—జీవితం చాలా చిన్నది, ద్వేషానికి విలువైనది కాదు.

Comments are closed.