కుప్పం భయాన్ని వదలని చంద్రబాబు!

పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కుప్పం భయం వ‌ద‌ల‌డం లేదు. జ‌గ‌న్ టార్గెట్ చేస్తే, సాధించే వ‌ర‌కూ విడిచిపెట్ట‌ర‌నే భ‌యం చంద్ర‌బాబును కుదురుగా వుండ‌నివ్వ‌డం లేదు. జ‌గ‌న్ తో…

పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కుప్పం భయం వ‌ద‌ల‌డం లేదు. జ‌గ‌న్ టార్గెట్ చేస్తే, సాధించే వ‌ర‌కూ విడిచిపెట్ట‌ర‌నే భ‌యం చంద్ర‌బాబును కుదురుగా వుండ‌నివ్వ‌డం లేదు. జ‌గ‌న్ తో పాటు మంత్రి పెద్దిరెడ్డి టార్గెట్ కూడా కుప్పం కావ‌డంతో ప్ర‌తి రెండు నెల‌ల‌కు ఒక‌సారి చంద్ర‌బాబు త‌న సొంత నియోజ‌వ‌ర్గ‌మైన కుప్పానికి గ‌త కొంత కాలంగా వెళ్లి వ‌స్తున్నారు. తాజాగా ఈ నెల 14,15,16 తేదీల్లో చంద్ర‌బాబు కుప్పంలో ప‌ర్య‌టించ‌బోతున్నారు.

2014 ఎన్నికల వరకు బాబుకు కుప్పంలో ఎదురులేకుండా ఉండేది. కానీ రాబోయే ఎన్నికలను చూసి ఆయ‌న‌ భయపడుతున్నారు. గెలుస్తానో గెలవనో అనే భయం ఆయన్ని పట్టి పీడిస్తోంది. ఇన్నేళ్ళలో ఆయన విజయం నల్లేరు మీద నడకలా సాగింది. కనీసం ఆయన వెళ్లి నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. స్థానిక నాయకులే దాఖలు చేసేవారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఆయన ఆటలు సాగేలా కనిపించడం లేదు. దీంతో వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్పటి నుండి కుప్పం స్థానిక నాయ‌కుల‌ను ఎన్నిక‌ల సిద్ధం చేయ‌నున్నారు.

గ‌త పర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు హ‌డ‌వుడి చేసిన నేప‌థ్యంలో ఈ ప‌ర్య‌ట‌న‌పై అంద‌రిలో అస‌క్తి నెల‌కొంది. నాలుగు మండలాల నాయ‌కులతో స‌మావేశం అయి ఎన్నిక‌ల‌కు దిశానిర్దేశం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా దాదాపు 25 సంవత్సరాలుగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా తన నియోజకవర్గంలో సొంత ఇల్లు లేకుండా ఉంటున్న చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులు క్రితం కొంత భూమి కొని మ‌రి ఇంటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ఓటమి త‌రువాత చంద్ర‌బాబులో మార్పు వ‌చ్చి రెండు నెల‌ల‌కు ఒక‌సారి కుప్పానికి వెళ్లి నాయ‌కుల‌ను క‌లుస్తున్నారు.