మంత్రుల మీద దాడులు ఖండించిన ఒకే ఒక పార్టీ

విశాఖ ప్రశాంతకు మారు పేరు. అలాంటి చోట ఒక కీలకమైన ఎమోషనల్ అంశం మీద గర్జన పేరిట కార్యక్రమానికి  నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపు ఇచ్చింది. అదే రోజు జనసేన కూడా కార్యక్రమం పెట్టుకుంది.…

విశాఖ ప్రశాంతకు మారు పేరు. అలాంటి చోట ఒక కీలకమైన ఎమోషనల్ అంశం మీద గర్జన పేరిట కార్యక్రమానికి  నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపు ఇచ్చింది. అదే రోజు జనసేన కూడా కార్యక్రమం పెట్టుకుంది. దాంతో విశాఖలో ఏదో జరుగుతుంది అని అంతా ఊహించారు. దానికి తగినట్లే మంత్రుల మీద విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రుల కాన్వాయి మీద దాడి జరిగింది. జనసేన వారు దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు.

దాని మీద పోలీసులు కూడా సీసీ ఫుటేజ్ ల ఆధారాలతో విచారణ జరిపి పలువురు జనసేన నాయకులను అరెస్ట్ చేశారు. అయితే మంత్రుల మీద దాడులను ఖండించని తెలుగుదేశం సహా ఇతర ప్రతిపక్షాలు అరెస్టులు అక్రమం అంటూ జెట్ స్పీడ్ తో స్పందించాయి. అధికారం చేతులలో ఉందని అరెస్టులు చేస్తారా అంటూ  పలువురు నాయకులు వైసీపీ సర్కార్ మీద ఘాటుగా విమర్శించారు.

అయితే ఒకే ఒక్క పార్టీగా సీపీఎం మాత్రం మంత్రుల మీద ఎయిర్ పోర్టులో జరిగిన దాడులను ఖండించింది. ఆ పార్టీ విశాఖ నాయకులు ఈ దాడులను తమ పార్టీ తీవ్రంగా చూస్తుందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కూడా సూచించింది. అంతే కాదు ప్రశాంత విశాఖలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు అశాంతిని రేపుతున్నాయని కూడా సీపీఎం ఆరోపించింది. ఎటువంటి ఇబ్బందులు విశాఖలో చోటు చేసుకోకుండా ప్రభుత్వమే బాధ్యతగా పరిస్థితిని చక్కదిద్దాలని  కూడా కోరడం విశేషం.

విశాఖలో ఒక్క రోజు వ్యవధిలో గొలుసుకట్టుగా జరిగిన సంఘటనల వల్లనే  ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు ప్రధాన పార్టీలలో ఒకరు తమ కార్యక్రమం వాయిదా వేసుకున్నా ఇబ్బంది వచ్చేది కాదు, ఇక పోటీగా ర్యాలీలు తీయడం, ఆ మీదట మంత్రుల వాహనాల మీద దాడులకు దిగడం వంటి చర్యలు జరిగాయి. దాంతో అరెస్టులు చోటు చేసుకున్నాయి.

అయితే విపక్ష పార్టీలు మంత్రుల మీద జరిగిన దాడులను మొదట ఖండించి ఆ మీదట జనసేన కార్యకర్తల అరెస్టుల విషయంలో కూడా రియాక్ట్ అయితే బాగుండేది. కానీ అలా కాకుండా ఏ కారణం లేకుండా కేవలం కక్షతో అరెస్టులు చేస్తున్నారు అంటూ ప్రచారం చేయడం వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. దీంతో విశాఖ వేదికగా రాజకీయాలనే అంతా చూస్తున్నారు అని అర్ధమవుతోంది. ఒక్క సీపీఎం మాత్రం యావత్తు పరిణామాల మీద స్పందించడం ద్వారా తన నిక్కచ్చితనాన్ని చాటుకుంది అంటున్నారు.