ఆ ఘనత ఆయనకే దక్కింది

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఇప్పటికి ముగ్గురు పనిచేశారు. అందులో తొలి ఇద్దరూ విశేష అనుభవంతో పాటు మంత్రులుగా పనిచేసి ఉన్నారు. సామాజిక సమీకరణలను అన్నీ చూసుకుంటూ వరుసగా ఉత్తరాంధ్రకే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్…

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఇప్పటికి ముగ్గురు పనిచేశారు. అందులో తొలి ఇద్దరూ విశేష అనుభవంతో పాటు మంత్రులుగా పనిచేసి ఉన్నారు. సామాజిక సమీకరణలను అన్నీ చూసుకుంటూ వరుసగా ఉత్తరాంధ్రకే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని టీడీపీ అధినాయకత్వం కట్టబెడుతూ వస్తోంది.

అలా విశాఖ జిల్లాకు చెందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. మంత్రి కావాలని అనుకున్న పల్లాకు ఇది పార్టీ పరంగా పెద్ద బాధ్యత. ఆయన ఈ పదవిలో నెమ్మదిగా కుదురుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఇంతలోనే ఆయన కొరడా ఝలిపించాల్సి వచ్చింది. పార్టీ పరంగా అతి పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే మీదనే సస్పెన్షన్ వేటు వేయాల్సి వచ్చింది. మహిళల మీద లైంగిక దాడి పేరుతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద సస్పెషన్ వేటు వేయడం ద్వారా పల్లా తన కత్తికి పదును ఎంతో చూపించారు.

పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నా ఇప్పటిదాకా ఆ తరహా కఠినమైన నిర్ణయాలను ఇంతకు ముందు వారు ఎవరూ తీసుకోలేదు. బహుశా అలాంటి సందర్భాలు కూడా వారికి ఎదురు అయి ఉండవు. పల్లాకు మాత్రం బాధ్యతలు చేపట్టిన కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.

దాంతో పల్లా గట్టి అధ్యక్షుడిగా ముద్ర పడ్డారు. ఎవరైనా పార్టీలో తోక జాడించినా పార్టీ ప్రతిష్టకు ఇబ్బంది తెస్తే మాత్రం యాక్షన్ తప్పదని పల్లా హెచ్చరించినట్లు అయింది. ఆ విధంగా తాను బలమైన నాయకుడిని అని పల్లా చాటుకునేందుకు ఇది ఒక అవకాశంగా మారింది.

6 Replies to “ఆ ఘనత ఆయనకే దక్కింది”

  1. ఇదేరకమైనా అభియోగాలు , ఆరోపణలు వైసీపీ నాయకుల మీద వస్తే వాళ్ళకి ఇంకా మంచి పదవులు ఇస్తాడు మా జగన్ anna

Comments are closed.