జనసైనికులకు పవన్ కళ్యాణ్ హితబోధ!

మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులు, నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగిన‌ నేపథ్యంలో, ఆ సంస్థలో బాలినేని పెట్టుబడులు పెట్టారంటూ జనసేనకు చెందిన ఓ కార్పొరేటర్ ఆరోపణలు చేయ‌డంతో దానికి ప్రతిస్పందించిన బాలినేని త‌న‌పై…

మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులు, నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగిన‌ నేపథ్యంలో, ఆ సంస్థలో బాలినేని పెట్టుబడులు పెట్టారంటూ జనసేనకు చెందిన ఓ కార్పొరేటర్ ఆరోపణలు చేయ‌డంతో దానికి ప్రతిస్పందించిన బాలినేని త‌న‌పై వ‌చ్చిన‌ ఆరోప‌ణ‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడాల‌ని డిమాండ్ చేయ‌డంతో ఆయ‌న ట్వీట్ట‌ర్ వేదిక‌గా రెస్పాండ్ అయ్యారు.

ప్రియమైన జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులకు.. అంటూ ప‌వ‌న్ ట్వీట్ట‌ర్ వేదిక‌గా ప‌లు సూచ‌న‌లు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చేయొద్దని.. కేవలం మీడియాలో వచ్చిందనో.. ఎవరో మాట్లాడారనో నిర్ధారణ కానీ అంశాలపై చెప్పొద్దన్నారు. అలాగే, పొత్తులపై సోషల్‌ మీడియాలో వచ్చే సమాచారం ఆధారంగా ఎట్టిపరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని.. పొత్తుల విషయంలో మేలు చేసే నిర్ణయం తానే స్వయంగా తీసుకుంటానని పునరుద్ఘాటించారు. సయోధ్యగా ఉన్న రాజకీయపక్షాల్లో చిన్నా చితకా నాయకులు తమపై ఏమైనా విమర్శలు చేస్తే వాటిని ఆ నాయకుడి వ్యక్తిగత విమర్శలుగా భావించాలని.. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించవద్దని ట్వీట్ట‌ర్ వేదిక‌గా బహిరంగ లేఖ రాసారు.

తాజా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచ‌న‌ల నేప‌థ్యంలో జ‌న‌సైనికుల్లో మార్పు వ‌స్తుందా లేదా అనేది చూడాలి. కాగా నారా లోకేష్ పాద‌యాత్ర వ‌ల్ల వారాహి  యాత్ర‌ను వాయిదా వేసుకున్నా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమా ఘాటింగ్ లో బిజీగా ఉన్నారు. ఏదైనా రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను ట్వీట్ట‌ర్ వేదిక‌గా పిడిఎఫ్ రూపంలో రిప్లే ఇస్తున్నారు.