అసంతృప్తి వ‌స్తుంద‌నే భ‌యం కూడా లేదా?

రాజ‌కీయాల్లో ఇంత ప‌చ్చిగా ఒక కులానికే అగ్ర‌స్థానం క‌ల్పించిన నాయ‌కుడిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మిగుల్తారు.

జ‌న‌సేన అధ్య‌క్షుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ధైర్యం ఏంటో అర్థం కాదు. ఒక‌ప్పుడు కుటుంబ పాల‌న గురించి ప‌వ‌న్ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్రాన్ని వైఎస్సార్‌, చంద్ర‌బాబునాయుడు కుటుంబాలు మాత్ర‌మే పాలించాలా? అతి త‌క్కువ జ‌నాభా క‌లిగిన ఆ రెండు కులాలకు చెందిన నాయ‌కులు, మిగిలిన సామాజిక వ‌ర్గాల‌పై రాజ‌కీయ పెత్త‌నం చేయ‌డం ఏంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించిన సంద‌ర్భాలు లేక‌పోలేదు.

ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ప‌వ‌న్ మాట‌లు విద్యావంతులు, మేధావుల్ని ఆక‌ర్షించాయి. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, ఆయ‌న‌లో రెండో మ‌నిషిని చూస్తున్నామ‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. సొంత అన్న నాగ‌బాబుకు ఎమ్మెల్సీతో పాటు కేబినెట్‌లోకి తీసుకునేలా సీఎం చంద్ర‌బాబును ఒప్పించారు. చంద్ర‌బాబు కేబినెట్‌లో ఇప్ప‌టికే ఒక మంత్రి ప‌ద‌వి నాగ‌బాబు కోసం ఖాళీగా ఉంచారు. ఇక నాగ‌బాబు ఎమ్మెల్సీ కావ‌డ‌మే ఆల‌స్యం.

నాగ‌బాబు మంత్రి కావ‌డం ఖాయ‌మైంది. దీంతో జ‌న‌సేన నుంచి న‌లుగురు మంత్రులు చంద్ర‌బాబు కేబినెట్‌లో ఉన్న‌ట్టవుతుంది. వీళ్ల‌లో నాదెండ్ల మ‌నోహ‌ర్ ఒక్క‌రే క‌మ్మ సామాజిక వ‌ర్గం. మిగిలిన ముగ్గురు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, నాగ‌బాబు, కందుల దుర్గేష్ కాపు సామాజిక వ‌ర్గం. త‌ద్వారా త‌న‌ది కుల‌పార్టీ అనే ముద్ర వేయించుకోడానికే ప‌వ‌న్ ఆస‌క్తి చూపుతున్నార‌నే అనుమానం క‌లుగుతోంది.

రాజ‌కీయాల్లో ఇంత ప‌చ్చిగా ఒక కులానికే అగ్ర‌స్థానం క‌ల్పించిన నాయ‌కుడిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మిగుల్తారు. ఆ మ‌ధ్య మంద‌కృష్ణ మాదిగ జ‌న‌సేన సామాజిక ఇంజ‌నీరింగ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ‌కీయంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ రానున్న రోజుల్లో త‌ప్ప‌క నిల‌దీత‌కు గురి అవుతారు. బ‌హుశా ఆయ‌న కూడా ఇదే కోరుకుంటున్నారేమో! త‌న కులానికి మాత్ర‌మే ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాల‌ను బ‌లంగా తీసుకెళ్లి, త‌ద్వారా త‌న సామాజిక వ‌ర్గంలో మ‌రింత బ‌ల‌ప‌డాల‌ని ఆయ‌న ఆలోచిస్తున్నార‌నే విష‌యాన్ని కొట్టి పారేయ‌లేం.

అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం భ‌యం లేకుండా ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న అన్న‌కు ఎమ్మెల్సీ, మంత్రి ప‌ద‌వులు ఇప్పించుకోవ‌డం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపాల‌ని అనుకుంటున్నారో ఆయ‌న‌కే తెలియాలి. ఔన‌న్నా, కాద‌న్నా ఇత‌ర సామాజిక వ‌ర్గాల్లో ఆయ‌న‌పై త‌ప్ప‌క వ్య‌తిరేక‌త ఏర్ప‌డుతుంది. ఆ విష‌యం తెలియ‌క‌నే ప‌వ‌న్ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అనుకోలేం. అయిన‌ప్ప‌టికీ ఆయన రాజ‌కీయ అడుగులు ముందుకే ప‌డుతున్నాయంటే, ఏ మాత్రం భ‌య‌ప‌డ‌డం లేద‌ని అనుకోవాలేమో!

15 Replies to “అసంతృప్తి వ‌స్తుంద‌నే భ‌యం కూడా లేదా?”

  1. పొద్దున్న … అన్నకు మంత్రి పదవి వద్దన్న పవన్..?

    మధ్యాహ్నం … అసంతృప్తి వస్తుందనే భయం కూడా లేదా..?

    ఒక రాతకి ఇంకో రాతకి పొంతనే లేదు.. పదవి ఇస్తే ఒక ఏడుపు.. ఇవ్వకపోతే ఇంకో ఏడుపు..

    ఏడవటానికి ఫిక్స్ అయిపోయినట్టున్నావు.. నెక్స్ట్ సాయంత్రానికి రాబోయే ఆర్టికల్..

    సాయంత్రం .. జగన్ కే లాభం.. కూటమికి నష్టం..

    దీనెమ్మాభడవా.. జగన్ కి ఇంత లాభం ఉన్నా.. ఆ ముండమొపికి పైసా ప్రయోజనం మాత్రం కలగడం లేదు..

    1. నువ్వు గ్రేట్ ఆంధ్ర వాడు ఆలా రాసిన తిడతావ్ ,ఇలా రాసిన తిడతావ్ . ఎవడి పని వాడు చేసుకోవటమే విమర్శించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు ఎం చేసిన విమర్శిస్తారు. ఇస్తే కుటుంబ పార్టీ ఇవ్వకపోతే సొంత అన్న ని కూడా పాటించుకొన్నాడు ఆంధ్ర కి ఎం చేస్తాడు . అది CBN ఐన ,పవన్ ఐన జగన్ ఐన

      1. ఓహో.. గ్రేట్ ఆంధ్ర వారు ఆర్టికల్స్ నా కోసమే రాస్తున్నాడా..?

        ఉన్న వార్తలను ఉన్నట్టు రాస్తున్నాడా.. ఆహా .. జస్ట్ అస్కింగ్.. అసలే న్యూట్రల్ జర్నలిస్టుగాడని ట్యాగ్ తగిలించుకొన్నాడు కదా..

        ..

        ఎవడి పని వాడు చేసుకోవడం అంటే.. జరిగిన దానితో సంబంధం లేకుండా.. ఇలా అయితే అలా.. అలా అయితే ఇలా .. అని జగన్ రెడ్డి కి అనుకూలం గా రాసుకోవడమేనా..

        దానికి నా కామెంట్స్ మీద తోసేయడం దేనికి.. వాడి వెబ్సైటు వాడి ఇష్టం అని గర్వం గా చెప్పుకోవచ్చు కదా..

  2. అన్న అయినా, మరెవరు అయినా, తమకు సరిసమానంగా మరెవరు వుండడం రాజకీయాల్లో ఎవరూ అంగీకరించరు. అంతగా ఇష్టపడరు. అది కొత్తేమీ కాదు. అదే మరోసారి ప్రూవ్ అవుతుంది అనుకోవాలి.

  3. అన్న అయినా, మరెవరు అయినా, తమకు సరిసమానంగా మరెవరు వుండడం రాజకీయాల్లో ఎవరూ అంగీకరించరు. అంతగా ఇష్టపడరు. అది కొత్తేమీ కాదు. అదే మరోసారి ప్రూవ్ అవుతుంది అనుకోవాలి.

  4. ఉదయం అన్నయ్య ను పక్కన పెట్టిన పవన్

    మధ్యాహ్నం అన్నయ్య కు మంత్రి పదవి ఇప్పిస్తున్న పవన్

    GA కొంచెం ఆపుకుంటే ఏం రాయాలో క్లారిటీ వస్తుంది

  5. G A…. కూట మి తప్పులు చేస్తుంటే,, మనకే లాభం కదా.. వాళ్ళ తప్పులు ఎత్తి చూపితే, ఆ తప్పులు సరి దిద్దుకుంటే… మనకే నష్టం కదా G A??

    అందుకే వాళ్ళు తప్పులు చేసినా, నువ్వు గమ్మున ఉండు సామి

Comments are closed.