పవన్ సీఎం కావాలని అభిమాని ఏం చేశాడంటే….?

పవన్ కళ్యాణ్ సీఎం కావాల్సిందే. ఆయనే ముఖ్యమంత్రి ఈ విషయంలో రెండవ ఆలోచనకు తావు లేదు అని జనసైనికులు, అభిమానించేవారు కచ్చితంగా ఉన్నారు. పవన్ రావాలి పాలన మారాలి అన్నది వారి స్లోగన్. తాము…

పవన్ కళ్యాణ్ సీఎం కావాల్సిందే. ఆయనే ముఖ్యమంత్రి ఈ విషయంలో రెండవ ఆలోచనకు తావు లేదు అని జనసైనికులు, అభిమానించేవారు కచ్చితంగా ఉన్నారు. పవన్ రావాలి పాలన మారాలి అన్నది వారి స్లోగన్. తాము ఏ పని చేసినా పవన్ని జనసేనను కలుపుకుని మరీ ప్రచారం చేస్తూ తన నిలువెల్లా పార్టీ మీద అభిమానాన్ని నింపుకున్నారు.

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం క్రిష్ణాపురం గ్రామంలో జనసేన అభిమాని తన పెళ్ళి కార్డు మీద మీద జనసేన ఎన్నికల ప్రణాళిక వేసి ప్రచారం చేస్తున్నారు అంటేనే వారి అభిమానం ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తన పెళ్లి కార్డుకు వెనక వైపు జనసేన మ్యానిఫేస్టోతో పాటు పవన్ ఫోటో గాజు గ్లాస్ గుర్తు ముద్రించి కార్డులు పంచుతున్నారు. 

వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయాలని ఈ అభిమాని కోరుకుంటున్నాడు. ఈ కార్డులను జనసేన విశాఖ జిల్లా నాయకులకు పంచి పెట్టారు ఈ నెల 10న జనసేన అభిమాని పెళ్ళి. ప్రస్తుతం ఈ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవన్ సీఎం కావాలన్న కోరిక సైనికులలో ఎంత బలంగా ఉందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్లుగా మీడియా వార్తల ద్వారా ప్రచారం సాగుతోంది. తెలుగుదేశంతో పొత్తు ఉంటే పవన్ సీఎం ఎలా అవుతారు అన్నదే సందేహంగా ఉంది.

అయినా జనసేనను అభిమానించేవారు మాత్రం పవన్ ముఖ్యమంత్రి అవాల్సిందే అంటున్నారు. పవన్ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటిస్తే వీరంతా గంపగుత్తగా ఓటేయడం ఖాయం. చంద్రబాబే సీఎం అంటే జనసైనికులు, అభిమానులు ఎలా స్పందిస్తారో.