గంటాకు షాక్ ఇస్తున్న పవన్…?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు. ఇది ఆ పార్టీ వారికే కాదు అందరికీ ఆసక్తిని కలిగించే విషయమే. అదే విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఈసారి…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు. ఇది ఆ పార్టీ వారికే కాదు అందరికీ ఆసక్తిని కలిగించే విషయమే. అదే విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఈసారి కూడా రెండు చోట్ల పోటీ చేస్తారా అన్నది పార్టీ వారిలో కలుగుతున్న సందేహం. అలా చేయాలని కోరుకుంటున్న‌ వారూ ఆ పార్టీలో ఉన్నారు.

పవన్ 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంతో పాటు విశాఖ జిల్లా గాజువాకలో పోటీ చేశారు. రెండు చోట్లా ఆయన ఓడారు. అయితే ఈసారి కూడా పవన్ రెండు చోట్ల పోటీకి దిగుతారు అన్న ప్రచారం ఉంది. ఆయన కన్ను గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లా  మీద కూడా ఉంది అని అంటున్నారు.

విశాఖ పవన్ పోటీ చేస్తే గాజువాకలోనే చేయాలని ఆ పార్టీ నాయకులు ఇప్పటికే కోరారు. కానీ పవన్ ఈసారి సీటు మారుస్తున్నారుట. అది విశాఖ ఉత్తరం సీటు అని చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. లేకపోతే తన మేనల్లుడు ప్రస్తుతం నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న చిక్కాల విజయబాబుకు టికెట్ ఇవ్వాలని కోరుతారు అని అంటున్నారు. ఇదే సీటు మీద బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కన్ను ఉంది.

అయితే ఇపుడు పవన్ ఈ సీట్లో నుంచి పోటీకి దిగుతారు అని టాక్ నడుస్తోంది. ఇక్కడ ఆయన సామాజికవర్గం బలంగా ఉండడమే కాదు, పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దాంతో పోటీకి దిగితే పవన్ గెలిచితీరుతారు అని ఆ పార్టీ వారు అంచనా వేసుకుంటున్నారుట. దాంతో పవన్ రెండు సీట్లలో పోటీ చేస్తే విశాఖ ఉత్తరం ఒకటిగా ఉంటుంది అని అంటున్నారు. ఒక వేళ సింగిల్ సీటు అయినా విశాఖ వైపే మొగ్గు అని చెబుతున్నారు.

ఇక్కడ వైసీపీ బలంగానే ఉంది. ఆ పార్టీ ఇంచార్జి కేకే రాజు నిత్యం జనాల్లో ఉంటున్నారు. అయితే పవన్ పోటీకి దిగుతారు అంటే అధికార పార్టీ తన స్ట్రాటజీ మార్చే సీన్ ఉంటుంది అని చెబుతున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే, బలమైన సామాజికవర్గానికి చెందిన నేతను, లోకల్ గా ఉండే నాయకుడిని బరిలోకి దింపాలని వైసీపీ స్కెచ్ వేస్తుంది అని అంటున్నారు. పవన్ విశాఖ ఉత్తరం అంటే గంటాకు షాకే అని చెబుతున్నారు.