టాలీవుడ్ లో అంతే..వస్తే అవకాశాలు అలా వస్తాయి. లేదంటే మొహం చాటేస్తాయి. అలా ఎలా సినిమా తరువాత సరైన సినిమా పడలేదు దర్శకుడు అనీష్ కృష్ణ కు. ఈవారం ఓ సినిమ విడుదల కాబోతోంది.
నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి. ఈ సినిమా సెన్సారు అయింది. పాజిటివ్ టాక్ నే వచ్చింది. దీంతో ఆ దర్శకుడికి రెండు అడ్వాన్స్ లు చేతిలో పడ్డాయి.
నిర్మాత చెరుకూరి సుధాకర్ పిలిచి మరీ అడ్వాన్స్ చేతిలో పెట్టారట. అలాగే ఆసియన్ సునీల్ మరో అడ్వాన్స్ చేతిలో పెట్టారు. మొత్తానికి సినిమా విడుదల కాకముందే రెండు అడ్వాన్స్ లు చేతిలో పడ్డాయి. బాగానే వుంది. కానీ కథలు వండాలి. హీరోలకు చెప్పాలి. ప్రాజెక్టులు ప్రారంభం కావాలి. అదంతా అతగాడి టాలెంట్ పై ఆధారపడి వుంటుంది.
ఈ లోగా దర్శకుడికి అడ్వాన్స్ లు చేతిలో పడ్డాయన్న వార్త తో కృష్ణ వ్రింద విహారి సినిమాకు పాజిటివ్ బజ్ తెస్తోంది.